నాగ్ 100వ రాజకీయాలు.. అదిరిపోయేలా డబుల్ ట్విస్ట్!

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాయింట్ ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తోంది. కథలో అత్యంత కీలకంగా ఉండే ఈ పవర్‌ఫుల్ సీఎం పాత్ర కోసం మేకర్స్ ఒక స్టార్ హీరోయిన్‌ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.;

Update: 2025-10-15 14:30 GMT

కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 'కూలీ', 'కుబేర' వంటి చిత్రాల్లో నెవ్వర్ బిఫోర్ పాత్రలతో ప్రయోగాలు చేసిన నాగ్, తన మైల్ స్టోన్ మూవీ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూ అక్కినేని అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.

లేటెస్ట్ గా జానర్, నాగ్ క్యారెక్టర్, కీలకమైన నటీనటుల ఎంపికపై ఒక క్రేజీ బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, నాగార్జున 100వ చిత్రం ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది. రాజకీయ నేపథ్యం అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంటుంది. దానికి తోడు, ఈ చిత్రంలో నాగార్జున ఏకంగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్.

ఒకే సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కింగ్‌ను చూడటం అభిమానులకు కనుల పండుగే. కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నాగ్, తన వందో చిత్రంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాయింట్ ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తోంది. కథలో అత్యంత కీలకంగా ఉండే ఈ పవర్‌ఫుల్ సీఎం పాత్ర కోసం మేకర్స్ ఒక స్టార్ హీరోయిన్‌ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆ పాత్రకు ఎవరు ఎంపికవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నాగార్జున ఎవర్ గ్రీన్ పెయిర్, టబును కూడా తీసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెనే సీఎం రోల్ కోసం సెలెక్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

దాదాపు 27 ఏళ్ల తర్వాత 'నిన్నే పెళ్లాడతా' కాంబో మళ్లీ తెరపైకి వస్తే, సినిమాకు అదనపు ఆకర్షణ వచ్చినట్లే. ఒకవేళ సీఎం పాత్రలో ఒక స్టార్ హీరోయిన్, మరో ముఖ్య పాత్రలో టబు ఇద్దరూ నటిస్తే, ఈ సినిమా స్టార్ కాస్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, పొలిటికల్ డ్రామా కావడంతో టైటిల్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా, నాగార్జున 100వ చిత్రాన్ని నిర్మాతలు భారీ బడ్జెట్‌తో, ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్. పొలిటికల్ థ్రిల్లర్, డ్యూయల్ రోల్, స్టార్ హీరోయిన్ల కలయికతో ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో ఒక బిగ్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ వార్గాలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News