• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ నిశ్చితార్థం...

అఖిల్ నిశ్చితార్థం క‌న్ఫామ్ చేసిన నాగార్జున‌

| ఎట్ట‌కేల‌కు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నాగార్జున అక్కినేని అందించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్కినేని చియాన్ అఖిల్ జైనాబ్ రావ్‌జీ ని పెళ్లాడ‌నున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-11-26 12:44 GMT

అక్కినేని ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ శుభ‌వార్త‌లు అందుతున్నాయి. నాగార్జున‌ పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య తాను ప్రేమించిన శోభిత ధూళిపాల‌ను పెళ్లాడుతున్నాడు. ఇప్ప‌టికే ఈ జంట నిశ్చితార్థం అయింది. డిసెంబ‌ర్ 4న పెళ్లి. ఇంత‌లోనే ఇప్పుడు రెండో కుమారుడు అక్కినేని అఖిల్ నిశ్చితార్థానికి సంబంధించిన అధికారిక వార్త వెలువ‌డింది. కింగ్ నాగార్జున స్వ‌యంగా దీనిని ధృవీక‌రించారు.

 

ఎట్ట‌కేల‌కు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నాగార్జున అక్కినేని అందించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్కినేని చియాన్ అఖిల్ జైనాబ్ రావ్‌జీ ని పెళ్లాడ‌నున్నాడు. ఈరోజు నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. కాబోయే కోడ‌లిని అక్కినేని కుటుంబం ప్రేమగా కుటుంబంలోకి స్వాగతించింది.

ఇన్‌స్టాలో అఖిల్ తన అభిమానులతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ''నా సంతోషం ఎప్పటికీ దొరికింది. జైనాబ్ రావ్‌జీ తో నిశ్చితార్థం చేసుకున్నాను అని ప్రకటించడం సంతోషంగా ఉంది'' అని రాసారు. ఈ వార్త ఇంట‌ర్నెట్ లో దావాన‌లంలా మారింది. అశేషంగా ఉన్న‌ అక్కినేని అభిమానులు, తెలుగు ప్ర‌జ‌ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో శోభితా ధూళిపాళను నాగ చైతన్య పెళ్లాడ‌నున్నారు. ఇంత‌లోనే ఈ ప్రకటన రావ‌డంతో ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా శుభ‌వార్త అందింది.

అంతకుముందు 2017లో అఖిల్ అక్కినేని- జీవీకే సంస్థానం వార‌సురాలు శ్రీ‌యా భూపాల్ తమ పెళ్లిని రద్దు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటలీలో ప్లాన్ చేసిన వివాహం కొన్ని నెల‌ల ముందు అనూహ్యంగా రద్దయింది. ఆ త‌ర్వాత‌ అఖిల్ తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టగా, శ్రీయా భూపాల్ తన ఫ్యాషన్ లేబుల్ ప‌నిపై విదేశాల‌కు వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అఖిల్ అక్కినేని కెరీర్ ప‌రంగా ఇంకా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి ఉంది. అఖిల్‌, మిస్టర్‌ మజ్ను, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, ఏజెంట్ వంటి చిత్రాల్లో న‌టించాడు. అత‌డి హార్డ్ వ‌ర్క్ డెడికేష‌న్ కి గుర్తింపు ద‌క్కినా ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంకా ద‌క్క‌లేదు. అయితే ప‌రాజ‌యాల‌కు చింతించ‌క అతడు కెరీర్ గేమ్ ఛేంజ్ చేయాల‌ని చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే అత‌డు రెండు కొత్త చిత్రాలకు సంతకం చేసాడు. రెండూ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానున్నాయి. యువి క్రియేష‌న్స్ లో 'ధీర' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహిస్తారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండవ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది.

We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee! We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz

— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024
Tags:    
  • Akhilakkineni 
  • AkkineniAkhilFiance 
  • Zainabravdjee 
  • Akkinenifamily 
  • Akkineninagarjuna 
  • Zainab 
  • Ravdjee 
  • Akhilzainabravdjee 
  • Akhilfiance 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS