• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గబ్బర్‌ సింగ్ కి పేపర్లు...

గబ్బర్‌ సింగ్ కి పేపర్లు ఎగరేసిన అకీరా!

| ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-09-03 08:05 GMT

ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో, ఢిల్లీ వెళ్లి మోడీని పవన్ కలిసిన సమయంలో కూడా అకీరా పక్కనే ఉన్నాడు. సోషల్‌ మీడియాలో ఆ సమయంలోనే అకీరా నందన్‌ పేరు ప్రముఖంగా వినిపించడం తో పాటు, కనిపించాడు. ఆ తర్వాత కూడా పవన్‌ ఏదో ఒక విషయంతో సోషల్‌ మీడియాలో ఉంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి అకీరా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాడు.

పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సూపర్‌ హిట్ మూవీ గబ్బర్‌ సింగ్‌ ను రీ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నా కూడా గబ్బర్ సింగ్‌ కి మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌ లో సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌ లతో పాటు, మల్టీప్లెక్స్ ల్లో గబ్బర్‌ సింగ్ మంచి స్పందన దక్కించుకుంది. పవన్‌ ఫ్యాన్స్‌ తో కలిసి అకీరా నందన్‌ సింగిల్ స్క్రీన్‌ థియేటర్ లో గబ్బర్ సింగ్ ను చూసి ఎంజాయ్ చేశాడు. స్నేహితులతో కలిసి పవన్ తనయుడు అకీరా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఫ్యాన్స్‌ తో కలిసి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ షో చూసిన అకీరా నందన్‌ తండ్రి కనిపించిన వెంటనే కేకలు వేస్తూ, పేపర్లు ఎగరవేశాడు. సాధారణంగా స్టార్‌ కిడ్స్ ఇంతగా ఫ్యాన్స్ తో కలిసి సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌ లలో సినిమాలు చూసి ఎంజాయ్‌ చేసే వారు చాలా తక్కువ అని చెప్పాలి. గబ్బర్ సింగ్‌ సినిమా మాత్రమే కాకుండా పవన్‌ ఏ సినిమా విడుదల అయినా అకీరా నందన్ ఫ్యాన్స్ షో ను చూస్తూ ఉంటాడు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అకీరా నందన్‌ ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆయన సినీరంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ తనయుడిగా అకీరా నందన్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అంతా కోరుకుంటున్నారు. కానీ అకీరా నందన్‌ ఆలోచన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అన్న వరుణ్ తేజ్ కంటే ఇంకాస్త ఎక్కువ ఎత్తు పెరిగిన అకీరా సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి కనబర్చుతున్నట్లుగానే ఉన్నాడు. అందుకే ఇప్పటికే డాన్స్ తో పాటు మార్షల్‌ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ముందు ముందు అకీరా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి తదుపరి రాబోతున్న హీరో అకీరా నే అనే చర్చ జోరుగా సాగుతోంది.

#AkiraNandan At #GabbarSingh4K Re release 🔥#HappyBirthdayPawanKalyan#gabbarsingh

pic.twitter.com/FgIIpgmMam

— Trivikram JSP (@Trivikram_Pavan) September 2, 2024
Tags:    
  • Akiranandan 
  • Pawankalyan 
  • Gabbarsingh 
  • Tollywood 
  • Filmindustry 
  • OG 
  • Hariharaveeramallu 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS