• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ తిప్పలు ఇంకా ఆగలేదు

అఖిల్ తిప్పలు ఇంకా ఆగలేదు

| త్వరలో తన కొత్త ప్రాజెక్ట్ గురించి అఖిల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-11-07 03:53 GMT

అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు హీరోగా ఐదు సినిమాల వరకు చేశారు. వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తప్ప ఇంకేవీ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు. ఈ ఏడాది వచ్చిన ఏజెంట్ మూవీ అయితే అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఏజెంట్ చిత్రం కోసం అఖిల్ తన లుక్, బాడీ మొత్తం మార్చుకున్నాడు. క్యారెక్టర్ కోసం విపరీతంగా కష్టపడి బాడీ బిల్డర్ లా మారాడు.

అయితే అఖిల్ క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడిన కంటెంట్ లో దమ్ములేకపోవడంతో మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో అఖిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడిగా భారీ బడ్జెట్ చిత్రం ఫైనల్ అయ్యి ఉంది. నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు. అయితే అఖిల్ మాత్రం ఈ సినిమా విషయంలో స్పీడ్ గా ఆలోచించడం లేదు.

మళ్ళీ రిస్క్ అవుతుందనే భయం అఖిల్ ని వెంటాడుతోంది. వంశీ పైడిపల్లి, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒదేల కూడా అఖిల్ కి కథలు చెప్పి ఉన్నారు. అయితే వీటి విషయంలో కూడా అతను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్ వేగంగా మూవీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. కాని అఖిల్ మాత్రం కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

స్క్రిప్ట్ ఒకే చేసిన బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సెట్స్ పైకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకులకి కూడా తన ఎంపికపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో తన కొత్త ప్రాజెక్ట్ గురించి అఖిల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఏది ఏమైనా ఏజెంట్ దెబ్బకి అఖిల్ కథల ఎంపికలో ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని అర్ధమవుతోంది.

మరి నెక్స్ట్ సినిమాని యూవీలో కొత్త దర్శకుడు అనిల్ తో చేస్తాడా లేదంటే దసరా ఫేం శ్రీకాంత్ కి ఛాన్స్ ఇస్తాడా, సీనియర్ స్టార్ దర్శకుడు అయిన వంశీ పైడిపల్లితో ప్రయత్నిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    
  • Akhil 
  • Mosteligiblebachelor 
  • Agent 
  • Vamsipaidipally 
  • Srikanthodela 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS