• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ పై మరోసారి బిగ్...

అఖిల్ పై మరోసారి బిగ్ బడ్జెట్.. హై లెవెల్లోనే..

| అక్కినేని యువ హీరో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు

By - Tupaki Desk
Update: 2024-01-28 05:01 GMT

అక్కినేని యువ హీరో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. అందులో అఖిల్, ఏజెంట్ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యాయి. మిగిలిన వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ మాత్రమే కాస్తా చెప్పుకోదగ్గ విధంగా ఉన్న మూవీలు. మిగిలిన రెండు కూడా ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నవి కావడం విశేషం. ఈ ఐదు సినిమాలు కూడా అఖిల్ ఇమేజ్ కి, మార్కెట్ కి మించి ఖర్చు పెట్టి చేసిన చిత్రాలే.

అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతో అరంగేట్రంలోనే భారీ బడ్జెట్ తో మూవీ చేసే అవకాశం అందుకున్నాడు. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో డెబ్యూ లభించింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. గత ఏడాది సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఇచ్చాడు.

నిజానికి ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. క్యారెక్టర్ మేకోవర్ కోసం బాడీ బిల్డ్ చేశాడు. లుక్ కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాడు. ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టాడు. అయితే కథ సరిగా లేకపోవడంతో అఖిల్ కష్టం వృథా అయ్యింది. ఈ సారి మాత్రం చేసే మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలనే కసితో అఖిల్ ఉన్నాడు. దానికోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు.

నెక్స్ట్ అఖిల్ చేయబోయే మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. యూవీ క్రియేషన్స్ ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మించడానికి సిద్ధం అయ్యిందంటే కంటెంట్ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీతో అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్ లో చాలా చిత్రాలకి స్క్రిప్ట్ తో పాటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అనిల్ కుమార్ పని చేశాడు.

అతని పై నమ్మకంతోనే అఖిల్ పై వంద కోట్లు పెట్టడానికి యూవీ వారు సిద్ధమయ్యారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఇండియన్ మైథాలజీ ఎడాప్షన్ తోనే ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అఖిల్ కచ్చితంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడని అతని అభిమానులు నమ్ముతున్నారు.

Tags:    
  • Akhilakkineni 
  • Filmindustry 
  • Agentmovie 
  • Anilkumar 
  • Uvcreations 
  • Akhil 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS