వీడియో : ప్రియురాలితో విమానాశ్రయంలో అఖిల్
అఖిల్ అక్కినేని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన జైనాబ్ రావ్‌జీ తో అఖిల్ నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది.;
అఖిల్ అక్కినేని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన జైనాబ్ రావ్‌జీ తో అఖిల్ నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది. వీరిద్దరి మధ్య సుదీర్ఘ కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోందని సమాచారం అందుతోంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి కాకముందే వీరిద్దరు కలిసి తెగ తిరిగేస్తున్నారు. ఈమద్య కాలంలో వీరి ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. జైనాబ్ తో వివాహం ప్రకటన వచ్చిన తర్వాత అఖిల్ సినిమా వార్తలతో కంటే ఈ విషయాల గురించే మీడియాలో ఎక్కువగా ఉంటున్నాడు అనడంలో సందేహం లేదు.
ముంబైకి చెందిన జైనాబ్ చిత్రకారిణి, నటిగాను మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది అంటారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న ఈమె భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. పెళ్లి గురించిన వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య మార్చిలోనే వీరి వివాహం అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు వీరి వివాహం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి వివాహం జరిగిందనే ప్రచారం ప్రముఖంగా జరుగుతోంది.
తాజాగా వీరిద్దరు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో అఖిల్ బ్లాక్ బ్యాక్ తో కారు దిగగా, జైనాబ్ సైతం స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా అందమైన మేకోవర్, ఔట్ ఫిట్‌తో అఖిల్ చేయి పట్టుకుని ఎయిర్ పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్లింది. అఖిల్, జైనాబ్ ఫోటోలను తీసేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఫోటో గ్రాఫర్ల వైపు చూసి చూడనట్లుగా చూస్తూ అఖిల్, జైనాబ్ వెళ్లి పోయారు. అఖిల్, జైనాబ్‌ల ప్రయాణం గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వీరిద్దరు సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇక అఖిల్ సినిమాల గురించి మాట్లాడుకుంటే.. 2023లో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని అఖిల్ తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. గత ఏడాదిలోనే అఖిల్ సినిమా రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా తాజా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సినిమాకు లెనిన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా నుంచి త్వరలో టీజర్‌ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.