అఖిల్ - జైనాబ్ ప్రేమ పరవశం.. బీచ్‌పై హగ్ పిక్ వైరల్!
తాజాగా అఖిల్ తన కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి బీచ్ సైడ్‌లో దిగిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.;
అక్కినేని వారసుడు అఖిల్ ఇటీవల తన ఎంగేజ్మెంట్ వార్తలతో పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్ హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా అఖిల్ తన కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి బీచ్ సైడ్‌లో దిగిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. “నా సర్వస్వం” అంటూ పిక్‌పై పెట్టిన క్యాప్షన్ ఈ ఫొటోకు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగినట్లు అక్కినేని సర్కిల్‌కు చెందినవారు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, మ్యారేజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే జైనాబ్ అఖిల్ జంట తరచూ బహిరంగంగా కనిపించడం, వారి మధ్యనున్న కెమిస్ట్రీ చూసినవారు త్వరలో పెళ్లి డేట్ కూడా వస్తుందన్న అనుమానంలో ఉన్నారు. తాజాగా బీచ్ లొకేషన్‌లో దిగిన ఈ కపుల్ ఫోటో ఆ ఊహలకే బలం చేకూర్చింది.
బీచ్ సైడ్‌లో వీరిద్దరూ ఒకేలా కాస్ట్యూమ్ ధరించి, ఒకరిని ఒకరు హత్తుకుని కనిపించడంతో ఫోటోలో ఎమోషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమలో మునిగిపోయిన కొత్త జంటలా అఖిల్ జైనాబ్ చూపించిన మ్యాజిక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా, అఖిల్ వ్యక్తిగతంగా ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ లవ్ లైఫ్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోందని కూడా అంటున్నారు.
ఇక ప్రొఫెషనల్ విషయానికి వస్తే, అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ లెనిన్ అనే టైటిల్‌తో ఓ కొత్త ప్రయోగాత్మక సినిమా కోసం రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.