అఖిల్ భార్య నాగార్జునను అలా పిలుస్తుందేంటి?
అయితే నాగ్ బర్త్ డే కు అందరూ విషెస్ చెప్పినట్టే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పగా, అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రావ్జీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.;
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటిలానే ఆయన పుట్టిన రోజుకు ఫ్యాన్స్ తో పాటూ సెలబ్రిటీల నుంచి కూడా బర్త్ డే విషెస్ వచ్చాయి. అయితే నాగార్జునకు ఈ 66వ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారింది. దానికి కారణం తండ్రిగా నాగ్ బాధ్యతలన్నీ తీరాక, ఇద్దరు కోడళ్లు వచ్చాక జరుపుకున్న బర్త్ డే ఇదే కావడం.
నిజమైన కింగ్ అంటూ పోస్ట్
అయితే నాగ్ బర్త్ డే కు అందరూ విషెస్ చెప్పినట్టే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పగా, అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రావ్జీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైనాబ్ తన మామగారైన నాగార్జునతో కలిసి స్టిల్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ నిజమైన రాజు అనే పదానికి నిజమైన అర్థం మీరే, రోజూ మీరు మాకు స్పూర్తినిస్తూనే ఉంటారు, నా తండ్రిగా ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని అంటూ రాసుకొచ్చింది.
నాగార్జునతో ఆమె బాండింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఆ పిలుపుని బట్టే అర్థం చేసుకోవచ్చు. వరుసకి మామ అయినప్పటికీ జైనాబ్ నాగార్జునను నాన్న అని పిలుస్తుందంటే నాగ్ ఆమెను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ అందరూ సంతోషంతో మునిగిపోతున్నారు. తమ అభిమాన హీరో వారి ఇంటి ఆడపడచుల పట్ల ఎంత ప్రేమ, బాధ్యత, మర్యాదగా ఉంటారో దీంతో అర్థమవుతుందని చెప్తూ ఆనందిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
జూన్ లో అఖిల్ ను పెళ్లాడి అక్కినేని కోడలుగా మారిన జైనాబ్
అఖిల్, జైనాబ్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుని, 2025 జూన్ 6న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటూ అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక వృత్తి పరంగా చెప్పాలంటే జైనాబ్ ఒక ఆర్టిస్ట్. అబ్‌స్ట్రాక్ట్, ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్స్, పెయింటింగ్ ఎగ్జిబిషన్లకు జైనాబ్ చాలా పాపులర్. ఆర్టిస్ట్ ప్రపంచంలో తనదైన శైలిలో జైనాబ్ ముందుకెళ్తున్నారు. ఇక నాగార్జున విషయానికొస్తే రీసెంట్ గా కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఇటీవలే కూలీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్వరలోనే తన 100వ సినిమాను నాగ్ అనౌన్స్ చేయనున్నారు.