లెనిన్ తర్వాత అఖిల్ ప్లాన్ ఏంటి..?
ఐతే లెనిన్ సినిమా యాక్షన్ కం లవ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అఖిల్ లుక్స్ ఇంప్రెస్ చేశాయి.;
అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం లెనిన్ అంటూ రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే లెనిన్ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ నవంబర్ రిలీజ్ ప్లాన్ చేయగా ఆ తర్వాత వాలెంటైన్ వీక్ రిలీజ్ అనుకున్నారు. కానీ ఫైనల్ గా మే 1న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. సమ్మర్ లో సత్తా చాటేందుకు అఖిల్ తన క్రేజీ సినిమా లెనిన్ తో రాబోతున్నాడు.
లెనిన్ యాక్షన్ కం లవ్ ఎంటర్టైనర్..
ఐతే లెనిన్ సినిమా యాక్షన్ కం లవ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అఖిల్ లుక్స్ ఇంప్రెస్ చేశాయి. అఖిల్, భాగ్య శ్రీ జోడీ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. ఐతే అఖిల్ లెనిన్ రిలీజ్ కు రెడీ అవుతుండగా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఐతే ఈ సినిమా తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటన్న డిస్కషన్ మొదలైంది.
అఖిల్ ఏజెంట్ తర్వాత కూడా ఏ సినిమా చేస్తున్నాడు అంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఐతే సైలెంట్ గా లెనిన్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లి టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. లెనిన్ తర్వాత అయినా అఖిల్ నెక్స్ట్ సినిమాను వెంటనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. కెరీర్ లో ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ లెనిన్ తో అది సాధించేలా కనిపిస్తున్నాడు. ఒక పక్కా కమర్షియల్ సినిమా మీటర్ లోనే లెనిన్ వస్తుంది.
అఖిల్ తో యువి సినిమాస్, హోంబలె ప్రొడక్షన్స్..
అఖిల్ లో ఉన్న మాస్ స్ట్రెంత్ చూపించేలా లెనిన్ వస్తుంది. ఐతే నెక్స్ట్ సినిమా విషయంలో మరీ లేట్ చేయకుండా త్వరగా ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అసలైతే అఖిల్ తో యువి సినిమాస్ ఇంకా హోంబలె ప్రొడక్షన్స్ కూడా మూవీస్ ప్లానింగ్ ఉందని టాక్. ఐతే వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆఫ్టర్ మ్యారేజ్ అఖిల్ ఇక తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెడుతున్నాడు. లెనిన్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుని నెక్స్ట్ సినిమాలతో పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. లెనిన్ సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అవగా ఆమెతో కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశారు. కానీ మధ్యలో శ్రీలీల ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవగా ఆ ప్లేస్ లో భాగ్య శ్రీ వచ్చి చేరింది. టాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో భాగ్య శ్రీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ ఇయర్ లెనిన్ తోనే తన హిట్ ఖాతా తెరవాలని చూస్తుంది అమ్మడు.