అఖిల్.. నెక్స్ట్ బిగ్ స్క్రీన్ పై దర్శనమిచ్చేదెప్పుడు?

ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు లెనిన్ మూవీ.. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-09-28 02:30 GMT

అయ్యగారు.. అదేనండీ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. కానీ కెరీర్ లో పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఏజెంట్ మూవీతో వచ్చి డిజాస్టర్ అందుకున్న అఖిల్.. ఇప్పుడు లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అఖిల్.. ఇప్పుడు మళ్ళీ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లెనిన్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరో 20 శాతాన్ని శరవేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.

ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు లెనిన్ మూవీ.. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నారని వినికిడి.

అయితే లెనిన్ సినిమా విషయానికొస్తే.. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. నాగార్జున అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తో సహా భాగస్వామిగా ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అఖిల్.. పూర్తిగా రగ్గ్‌డ్ లుక్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించారు. మొదట్లో మైథాలజీని జోడించి గ్లింప్స్ వీడియోను మేకర్స్ కట్ చేయగా.. సినీ ప్రియులతోపాటు అక్కినేని అభిమానుల్లో మంచి బజ్ నెలకొంది.

అయితే గ్లింప్స్ అఖిల్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి విదితమే. ఆమెను హాఫ్ శారీలో క్యూట్ గా చూపించారు. కానీ ఇప్పుడు శ్రీలీల బదులు క్రేజీ హీరోయిన్ భాగశ్రీ బోర్సె అఖిల్ కు జోడీగా నటిస్తున్నట్లు సమాచారం. డేట్స్ విషయంలో ఇబ్బంది వస్తుండడంతో భాగ్యశ్రీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు శ్రీలీలతో ఎనిమిది రోజుల చిత్రీకరణ మాత్రమే నిర్వహించారు మేకర్స్. ఆ సన్నివేశాలను భాగ్యశ్రీతో తిరిగి చిత్రీకరించాల్సి వచ్చింది. కాస్త డబుల్ వర్క్ అయినా.. నిర్మాణం వేగంగా ముందుకు సాగుతున్నట్లు వినికిడి. దీంతో అఖిల్ సహా మూవీ టీమ్.. లెనిన్ పై ఎంత ఫోకస్ పెట్టారో క్లియర్ గా తెలుస్తోంది. మరి లెనిన్ మూవీతో అఖిల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News