'అఖండ 2' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ లాక్, రిపోర్ట్ ఎలా ఉందంటే?

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది.;

Update: 2025-12-03 09:56 GMT

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ అనే పేరుంది. 'అఖండ' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, రన్ టైమ్ ఎంత లాక్ చేశారనే విషయాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే, 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు. సాధారణంగా భారీ కమర్షియల్ సినిమాలకు ఈ మాత్రం నిడివి ఉండటం సహజమే. అయితే ఈసారి ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా అనేదే ముఖ్యం. సెన్సార్ సభ్యుల నుంచి మాత్రం సినిమా పట్ల సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమాలో ప్రధానంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పే సన్నివేశాలు, దానికి సంబంధించిన డైలాగులు బాలయ్య మార్క్ లో ఉంటాయట. మొదటి పార్ట్ తో పోలిస్తే, ఇందులో చూపించే ప్రపంచం, విజువల్స్ కొంచెం కొత్తగా, ఫ్రెష్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు బోయపాటి శ్రీను కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే, బాలకృష్ణ అఘోరా పాత్రను మరో మెట్టు ఎక్కించేలా డిజైన్ చేశారని అంటున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, మదర్ సెంటిమెంట్, శివుడికి సంబంధించిన అంశాలు కథలో అంతర్లీనంగా సాగుతాయని సమాచారం. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కోరుకునే విధంగానే ఉండబోతోందట.

సెన్సార్ పూర్తయిన తర్వాత అధికారుల నుంచి టీమ్ కు అభినందనలు దక్కాయని, అన్ని భాషల్లోనూ ఇదే రకమైన రెస్పాన్స్ ఆశిస్తున్నామని నిర్మాతలు భావిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ లాక్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, బుక్ మై షోలో సినిమా ట్రెండింగ్ లో ఉంది. బయట వినిపిస్తున్న సెన్సార్ టాక్ డీసెంట్ గానే ఉన్నా, అసలు ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. మొత్తానికి ఎలాంటి కట్స్, ఇబ్బందులు లేకుండా 'అఖండ 2' రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది.

Tags:    

Similar News