ఆ సీన్స్ కు ఆశ్చర్యపోవడం ఖాయమట!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న సినిమా అఖండ2 తాండవం.;
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న సినిమా అఖండ2 తాండవం. బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కలయిలో వస్తోన్న నాలుగో సినిమా కావడం, పైగా సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తోన్న సినిమా కావడంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఇంకా మొదలుపెట్టని ప్రమోషన్స్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అఖండ2 సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడంతో పాటూ, అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజి కూడా రిలీజవుతుండటంతో అఖండ2 వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి.
లార్జర్ దేన్ లైఫ్ గా అఖండ2
ఇదిలా ఉంటే అఖండ2 సినిమాను బోయపాటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా రూపొందించారని, అందులో భాగంగానే సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారని, ప్రస్తుతం వాటికి సంబంధించిన సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అఖండ2 ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వీఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట.
క్లారిటీ ఇస్తే బెటర్
ఈ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, వీఎఫ్ఎక్స్ విషయంలో ఏ చిన్న కామెంట్ చేసే ఛాన్స్ ను ఆడియన్స్ కు ఇవ్వకూడదని చాలా కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు. అంతేకాదు, ఇంటర్వెల్ లో వచ్చే వీఎఫ్ఎక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేయడం ఖాయమని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ విషయంలో ఉన్న డౌట్ ను తీర్చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.