నట సింహం నటరాజ తాండవం..!

దసరా సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అఘోరా నటరాజ భంగిమ అదరగొట్టేసింది. ఈ సినిమాతో బాలయ్య బాబు మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపించబోతున్నారు.;

Update: 2025-10-02 05:13 GMT

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అఖండ 2 తాండవం. 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల క్రితం రిలీజైన అఖండ సినిమా ఫ్యాన్ ఫీస్ట్ ఇవ్వగా ఈసారి అఖండ 2 తాండవం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. అసలైతే సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఫైనల్ గా డిసెంబర్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

 

సింహా నుంచి ఈ కాంబో..

అఖండ 2 సినిమా నుంచి అప్పట్లో ఒక గ్లింప్స్ టీజర్ రాగా లేటెస్ట్ గా దసరా సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. నటరాజ రూపంలో బాలయ్య తాండవం అదరగొట్టేసిందని చెప్పొచ్చు. బాలయ్య బోయపాటి ఈ కాంబో సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. సింహా నుంచి ఈ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే ఈసారి అఖండ 2 తాండవం తో భారీ ప్లానింగ్ తో వస్తున్నారు బోయపాటి.

దసరా సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అఘోరా నటరాజ భంగిమ అదరగొట్టేసింది. ఈ సినిమాతో బాలయ్య బాబు మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపించబోతున్నారు. అఖండ కేవలం తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తే ఈసారి అఖండ 2 తాండవం నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేయాలని వస్తుంది.

అఖండ టైం లోనే స్పీకర్స్ బ్లాస్ట్..

అఖండ 2 సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగానే ఉండేలా ఉంది. సినిమాను బోయపాటి శ్రీను చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నారు. అఖండ 2 సినిమాకు థమన్ మరో హైలెట్ అవ్వబోతున్నాడు. అఖండ టైం లోనే స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వగా అఖండ 2 కోసం మరింత కష్టపడుతున్నాడు. డిసెంబర్ 5న నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరికీ అఖండ 2 తాండవం ఒక మాస్ ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు.

అఖండ 2 పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా అఘోరాగా బాలకృష్ణ పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇయర్ ఎండింగ్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి అఖండ 2 తో బాలయ్య అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్లానింగ్ తో వస్తున్నారు.

Tags:    

Similar News