ఇండస్ట్రీలోనే నెగిటివిటీ.. గ్రౌండ్ రిపోర్ట్ వేరు: అఖండ 2 నిర్మాతలు
అయితే ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని రామ్ ఆచంట తెలిపారు. అన్ని ప్రాంతాలు కలిపి ప్రీమియర్స్ కు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు.;
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆ సినిమా.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది.
దీంతో మేకర్స్ అఖండ 2 తాండవం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో తాజాగా నిర్వహించగా.. అందులో సినిమా నిర్మాతలు, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పాల్గొన్నారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని రామ్ ఆచంట తెలిపారు. అన్ని ప్రాంతాలు కలిపి ప్రీమియర్స్ కు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. కేవలం కర్ణాటకలో దాదాపు కోటి రూపాయలు వచ్చాయని చెప్పారు. ప్రీమియర్స్ కు అంత మొత్తంలో కలెక్ట్ చేసిన నాన్ కన్నడ సినిమాల్లో అఖండ 2 ఐదో చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
హిందీ బెల్ట్ లో సుమారు 800 థియేటర్స్ లలో విడుదల చేశామని, అక్కడ కూడా మంచి టాక్ వచ్చిందని గోపీ ఆచంట తెలిపారు. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు యాడ్ అవుతాయని వెల్లడించారు.
వీకెండ్ కు అదిరిపోయే ఫిగర్స్ చూస్తామని మాకు నమ్మకం ఉందని, ఓవర్సీస్ రెస్పాన్స్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ వీకెండ్ బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని, అన్ని షోలు ఫాస్ట్ గా ఫుల్ అవుతున్నాయని అన్నారు. శని, ఆదివారాల్లో కలెక్షన్లు ఇంకా సూపర్బ్ గా ఉంటాయని, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు.
అయితే అఖండ సినిమాకు బయట ఎక్కడా నెగిటివిటీ లేదని తెలిపిన రామ్ ఆచంట.. ఇండస్ట్రీలో కొద్దిగా ఉందని చెప్పారు. బయట ఆడియన్స్ లో ఎలాంటి నెగిటివిటీ లేదని, ఇండస్ట్రీలో మిక్స్ డ్ రిపోర్ట్ ఉందని తెలిపారు. టాలీవుడ్ లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదని వెల్లడించారు. రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉండటంలో ఎలాంటి తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందన్నారు. ఆడియన్స్ టాక్ తమకు ఎప్పుడూ ఇంపార్టెంట్ అని వెల్లడించారు.