అఖండ 2 సస్పెన్స్ తీరేది ఎప్పుడు..?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా అసలైతే సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేసుకున్నారు.;

Update: 2025-07-24 19:30 GMT

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా అసలైతే సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేసుకున్నారు. టీజర్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్. సినిమాలో బాలయ్య మాస్ విధ్వంసం తో రికార్డుల చెడుగుడు ఆడేస్తాడని అంటున్నారు. సం యుక్త మీనన్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న అఖండ 2 కి మరోసారి థమన్ తన మాస్ డ్యూటీ చేస్తున్నాడట.

అఖండ 2 సినిమాను దసరాకి రిలీజ్ ఫిక్స్ అనుకున్నారు. కానీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే క్రమంలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకాస్త బాగా చేయాలని ఆలోచిస్తున్నారట. అందుకే హర్రి బర్రి అన్నట్టు కాకుండా సినిమాను అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చే వరకు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అనుకున్న సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయట. ఐతే అఫీషియల్ గా చిత్ర యూనిట్ ఆ విషయాన్ని అనౌన్స్ చేయలేదు.

ఐతే దసరా కి అదే సెప్టెంబర్ 25కి ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. దానయ్య డివివి భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా జరిగిన వీరమల్లు ఈవెంట్ లో కూడా ఓజీ ఓజీ అనే కేకలు వేశారు.

అఖండ 2 వస్తుందో లేదో అన్నది తెలియదు కానీ ఓజీ మాత్రం తప్పనిసరిగా సెప్టెంబర్ 25 వచ్చి తీరుతుంది. అఖండ 2 రిలీజ్ డేట్ పై కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. రిలీజ్ డేట్ ముఖ్యం కాదు సినిమా ఆడియన్స్ ని అలరించేలా చేయడం ముఖ్యం. అందుకే అఖండ 2 రిలీజ్ పై ఇంకా స్పష్టత తీసుకోలేదు.

ఒకవేళ అఖండ 2 దసరా రేసు నుంచి తప్పుకుంటే మాత్రం పవర్ స్టార్ ఓజీకి కలిసి వచ్చినట్టే. ఐతే దసరాకి అఖండ 2 మిస్ అయితే తమిళ సినిమాలు ఏవైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే ఆ సినిమాలు ఏంటి అన్నది కూడా మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News