బాలయ్య 'అఖండ-2'.. ఆ పనులన్నీ కంప్లీట్..

అలా మొత్తం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే అఖండ-2 సినిమా రూ.145 కోట్లు రాబట్టిందని టాక్. ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ డీల్ అనే చెప్పాలి.;

Update: 2025-10-14 19:28 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2: తాండవం మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో అఖండ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన అఖండ సీక్వెల్ విడుదల కావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. దీంతో మేకర్స్ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని డీల్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అఖండ-2 థియేట్రికల్ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోగా.. రీసెంట్ గా శాటిలైట్ హక్కులు కూడా అదే విధంగా నెంబర్ కు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖండ సీక్వెల్.. ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ జియో హాట్‌ స్టార్ రూ.85 కోట్లకు దక్కించుకుందని ఇప్పటికే సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

ఇప్పుడు అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్‌ ను స్టార్ టీవీ రూ.60 కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలా మొత్తం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే అఖండ-2 సినిమా రూ.145 కోట్లు రాబట్టిందని టాక్. ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ డీల్ అనే చెప్పాలి. బాలకృష్ణ చిత్రాలలో అత్యధిక ధరకు అఖండ-2కు చెందిన హక్కులు అమ్ముడయ్యాయి!

ఇక సినిమా విషయానికొస్తే.. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కూడా మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

తమన్ సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. రీసెంట్ గా మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దించారు. శక్తిమంతమైన నేపథ్య సంగీతం అందించడంతోపాటు గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచేందుకు వారిని తీసుకొచ్చారు మేకర్స్. పండిట్ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్ మిశ్రా సంస్కృత శ్లోకాలు పఠించడంలో ఎంతో నైపుణ్యం ఉన్నవారన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News