అఖండ 2 : రిలీజ్‌ డేట్‌ పై బిగ్‌ అప్‌డేట్‌

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు బాలకృష్ణ సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు చేశారు. మూడు సినిమాల్లోనూ చాలా పవర్‌ ఫుల్‌ పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే.;

Update: 2025-05-24 22:30 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరి కాంబోలో గతంలో వచ్చిన అఖండ సూపర్‌ హిట్‌గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్‌ కథకు కొనసాగింపుగా అఖండ 2 కథ ఉంటుందని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి. మొదటి పార్ట్‌లో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఇక సీక్వెల్‌లోనూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ద్వారా అభిమానులకు మరోసారి డ్యూయల్‌ రోల్‌ ఫీట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు బాలకృష్ణ సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు చేశారు. మూడు సినిమాల్లోనూ చాలా పవర్‌ ఫుల్‌ పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే. అఖండ చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో వీరి కాంబో మూవీగా నిలిచింది. ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం అఖండ సినిమా మెప్పించింది. అందుకే విడుదలైన సమయంలోనే దర్శకుడు బోయపాటి సీక్వెల్‌పై ఆసక్తిని కనబర్చారు. అదే సమయంలో బాలకృష్ణ కూడా సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ప్రారంభం కావడం ఆలస్యం అయింది, షూటింగ్‌ ప్రారంభం తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

అఖండ 2 సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా బరి నుంచి సినిమాను క్రిస్మస్‌ బరిలో దించాలని భావిస్తున్నారు. మొదట ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ 2026 సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ ఉన్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమా రంగంలోకి దిగబోతుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

2025 సంక్రాంతికి అనిల్‌ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోటీ పడ్డ బాలకృష్ణ డాకు మహారాజ్‌ కు నష్టం మిగిలింది. డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోటీలో నిలువలేకపోయింది. దాంతో కమర్షియల్‌గా బ్రేక్‌ సాధించడంలో విఫలం అయింది. డాకు మహారాజ్ సినిమా ఫలితం నేపథ్యంలో అఖండ 2 సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తూ ఉండవచ్చు. అందులో భాగంగానే దసరా మిస్‌ అయితే క్రిస్మస్‌కి అఖండ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News