అఖండ‌2 లో బాల‌య్య -2 ట్విస్ట్ ఇలా!

ఇండియాలో మాత్ర‌మే షూటింగ్ జ‌రుపుకున్న 'అఖండ' టీమ్ తొలిసారి విదేశాల్లో కొత్త షెడ్యూల్ షురూ చేసింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జార్జియోలో జ‌రుగుతోంది.;

Update: 2025-05-25 12:30 GMT
అఖండ‌2 లో బాల‌య్య -2 ట్విస్ట్ ఇలా!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో 'అఖండ‌2' భారీ అంచ‌నాల మ‌ద్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ స‌హా ప‌రిస‌ర ప్రాంతాలు..ఇండియాలో మాత్ర‌మే షూటింగ్ జ‌రుపుకున్న 'అఖండ' టీమ్ తొలిసారి విదేశాల్లో కొత్త షెడ్యూల్ షురూ చేసింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జార్జియోలో జ‌రుగుతోంది. దీనిలో భాగం్గా బాల‌య్య‌పై ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీక రించేందుకు రంగం సిద్దం చేస్తుంది.

ఇది సినిమాకే హైలైట్ అయ్యే యాక్ష‌న్ ఎపిసోడ్ అని స‌మాచారం. ఈ ఫైట్ ఫారెన్ ఫైట‌ర్స్ మ‌ధ్య‌లో చిత్రీక‌రించేలా ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది ఈ సీక్వెన్స్ లో పాల్గొంటార‌ని , చాలా క్రియేటివ్ గాను ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు. అలాగే ఇదే సీక్వెన్స్ లో బాలయ్య సెకెండ్ రోల్ కు సంబం ధించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందిట‌. బాల‌య్య పాత్ర‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ అఘోర పాత్ర మాత్ర‌మే హైలైట్ అయింది.

మెయిన్ లీడ్ అదే కావ‌డంతో ఆవిష‌యాలే లీక్ అయ్యాయి. కుంభ‌మేళలో ఆ పాత్ర‌పై ఎన్నోకీల‌క స‌న్ని వేశాలు చిత్రీక‌రించారు. అయితే రెండో పాత్ర‌కు సంబంధించి ఇంత వ‌ర‌కూ ఎలాంటి లీక్ రాలేదు. జార్జియో షెడ్యూల్ కార‌ణంగా ఆ పాత్ర‌కు సంబంధించిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో? ఇక‌పై మ‌రిన్ని కొత్త విష‌యాలు తెలుస్తాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న ఆస‌క్తి మొద‌లైంది.

'అఖండ‌'లో తొలి రోల్ కూడా ప‌వ‌ర్ పుల్ గానే డిజైన్ చేసారు. ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగంలో ఇంకే రేంజ్ లో ఉంటుంది? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. ఈ సినిమా రిలీజ్ ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఒక‌వేళ వాయిదా ప‌డితే గ‌నుక ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ లోనే రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News