అఖండ 2: 3D టాక్ ఎలా ఉందంటే..

2Dలో చూస్తే ఇవి మామూలు గ్రాఫిక్స్ లా అనిపించవచ్చు కానీ, 3D ఎఫెక్ట్స్ లో మాత్రం ఎఫెక్టివ్ గా వచ్చాయట.;

Update: 2025-12-12 13:15 GMT

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ఒక డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది. చాలా మంది ఈ సినిమాను 2D ఫార్మాట్ లోనే చూశారు. ఇక మిక్స్ డ్ టాక్ వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే టాక్ సంగతి పక్కన పెడితే ఒక విషయంలో మాత్రం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది, అదే 3Dలో సినిమా చూసిన వారి నుంచి మాత్రం టాక్ కొంచెం డిఫరెంట్ గా వస్తోంది.

ఈరోజు ఉదయం నుంచి 3Dలో సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి వినిపిస్తున్న మాట వేరేలా ఉందని అంటున్నారు. సినిమాకు వచ్చిన జనరల్ టాక్ ఎలా ఉన్నా సరే, 3D వెర్షన్ లో చూసిన వాళ్ళకి మాత్రం ఇందులో విజువల్స్ బాగా నచ్చుతున్నాయట. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, ఎఫెక్ట్స్ 3Dలో చాలా బాగా కుదిరాయని అంటున్నారు. 2Dలో చూసినప్పుడు సాధారణంగా అనిపించిన ఫైట్స్, 3Dలో చూస్తున్నప్పుడు మాత్రం ఆ డెప్త్ వల్ల ఎఫెక్టివ్ గా అనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో 3D టెక్నాలజీ ఇప్పటివరకు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. చాలా సినిమాలు నెగిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ 3D ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయని అంటున్నారు.

ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆంజనేయ స్వామి పూనకం వచ్చినట్లు ఉండే సీన్ గురించి. బాలయ్య గద పట్టుకుని విశ్వరూపం చూపించే ఆ ఎపిసోడ్, 2D కంటే 3Dలో నెక్స్ట్ లెవెల్ లో ఉందట. ఆ గద మన మీదకు వస్తున్నట్లు, ఆ ఆంజనేయ స్వామి వైబ్రేషన్స్ మనకు తగులుతున్నట్లు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తోందని అంటున్నారు.

సినిమాలో విలన్ గా చేసిన ఆది పీనిశెట్టి మాంత్రికుడి పాత్రకు సంబంధించిన సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. ఆ క్యారెక్టర్ చుట్టూ దెయ్యాలు, భూతాలు తిరిగే సన్నివేశాలు ఉన్నాయి. 2Dలో చూస్తే ఇవి మామూలు గ్రాఫిక్స్ లా అనిపించవచ్చు కానీ, 3D ఎఫెక్ట్స్ లో మాత్రం ఎఫెక్టివ్ గా వచ్చాయట.

దీంతో ఈ సినిమా కథతో సంబంధం లేకుండా, ఆ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇష్టపడే వారికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు, త్రీడీ ఎఫెక్ట్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుందట. మన తెలుగులో 3D ఎఫెక్ట్స్ ను ఇప్పటివరకు సరిగ్గా ఎక్స్ పీరియన్స్ చేయని వాళ్లకు ఇది బాగా నచ్చే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు.

ఈరోజు 3Dలో సినిమా చూసిన చాలా మంది.. ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ త్రీడీలో బాగున్నాయని చెబుతున్నారు. ఆ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ ను సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తున్నాయట. సినిమా కథ, ఓవరాల్ టాక్ సంగతి పక్కన పెడితే.. 3D ఎక్స్ పీరియన్స్ విషయంలో మాత్రం 'అఖండ 2' ని కొంచెం స్పెషల్ గా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News