అజిత్ 'AK64'.. కిల్లింగ్ స్క్వాడ్!
అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన 64వ సినిమా ('AK64' వర్కింగ్ టైటిల్) గురించి వస్తున్న అప్‌డేట్స్ హై రేంజ్‌లో ఉన్నాయి.;
అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన 64వ సినిమా ('AK64' వర్కింగ్ టైటిల్) గురించి వస్తున్న అప్‌డేట్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. 'మార్క్ ఆంటోని' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో ఈ సినిమా పక్కా పాన్ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్కేల్, బడ్జెట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతుంటే, ఇప్పుడు లీకైన ఒక న్యూస్.. ఈ హైప్‌ను మరో రేంజ్ కి తీసుకెళ్లింది.
విషయం ఏంటంటే, ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌తో పాటు మరో ఇద్దరు పవర్‌హౌస్ యాక్టర్లు జాయిన్ అవుతున్నారట. వాళ్లు మరెవరో కాదు, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్. ఈ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాటెస్ట్ న్యూస్.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఏమిటంటే.. వీళ్లిద్దరూ అజిత్‌కు ఫ్రెండ్స్‌గా వస్తారా లేక విలన్లుగా ఢీ కొడతారా అనేది సస్పెన్స్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, వీళ్లవి రొటీన్ గెస్ట్ రోల్స్ లాంటివి కాదట. స్టోరీలో మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఇచ్చే, మల్టీ లేయర్డ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లట. ముఖ్యంగా విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ ఉన్నాడంటే మామూలు విలనిజం ఉండదు.
'AK64'ను డైరెక్టర్ అధిక్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ఇది అజిత్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని, ఈ సినిమా కోసం అజిత్ కూడా తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. టాప్ క్లాస్ టెక్నీషియన్స్, హాలీవుడ్ యాక్షన్ మాస్టర్స్‌తో ఒక విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఈ కాస్టింగ్ లిస్ట్ చూస్తుంటేనే అర్థమవుతోంది, ఇది కేవలం తమిళనాడు టార్గెట్ కాదు. పక్కా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అజిత్ స్టైల్, విజయ్ సేతుపతి యాక్టింగ్, లారెన్స్ ఎనర్జీ.. ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.
ప్రస్తుతానికి ఈ న్యూస్ లీకుల దశలోనే ఉన్నా, జనవరిలో మేకర్స్ ఫుల్ డీటెయిల్స్‌తో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఒకవేళ ఈ ముగ్గురి కాంబో నిజమైతే, 'AK64' అజిత్ కెరీర్ లోనే మరో బిగ్ మూవీగా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.