సీనియ‌ర్ స్టార్ తో హిట్ బ్యూటీ రొమాన్స్!

తల అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో మ‌రో సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. అధిక్ ర‌విచంద్రన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా తెలుగులోనూ బాగానే ఆడింది.;

Update: 2025-06-14 05:55 GMT

తల అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో మ‌రో సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. అధిక్ ర‌విచంద్రన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా తెలుగులోనూ బాగానే ఆడింది. రొటీన్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా అనే రివ్యూలు వ‌చ్చినా? వాటితో ప‌నిలేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో స‌త్తా చాటింది. తాజాగా ఇదే కాంబినేష‌న లో మ‌రో చిత్రానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. అజిత్-ఆధిక్ కాంబినేష‌న్ లో ఇది రెండ‌వ చిత్రం.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' స‌క్సెస్ చూసి అజిత్ ఇచ్చిన అవ‌కాశం ఇది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. దీనిలో బాగంగా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. మ‌రికొంత మంది భామ‌ల్ని ప‌రిశీలించినా వాళ్ల‌క‌న్నా శ్రీనిధి ఆ పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా సెట్ అవ్వ‌డంతో ఆమెనే ఎంపికయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇటీవ‌లే శ్రీనిధి 'హిట్ 3' తో తెలుగులో భారీ విజ‌యం అందుకుంది. అంత‌కు ముందు కేజీఎఫ్ తో పాన్ ఇండియాలోనే ఫేమ‌స్ అయింది. కానీ ఆ క్రేజ్ తో బిజీ న‌టి కాలేక‌పోయింది. ఇప్పుడిప్పుడిడే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తెలుగులో 'తెలుసు క‌దా' అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో సిద్దు జొన్న‌గ‌డ్డ‌కు జోడీగా క‌నిపించ‌నుంది. అజిత్ తో ఛాన్స్ వ‌స్తే తిరుగుండ‌దు. శ్రీనిధికి కోలీవుడ్ లో మ‌రో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది.

విక్ర‌మ్ తో 'కోబ్రా'లో న‌టించినా ఆసినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. అటుపై అక్కడ అవ‌కాశాలు కూడా రాలేదు. తాజాగా అజిత్ సినిమాలో ఛాన్స్ అంటూ శ్రీనిధి పేరు తెర‌పైకి రావడంతో అమ్మ‌డు నెట్టింట వైర‌ల్ అవు తోంది. యాక్ష‌న్ చిత్రాల‌కు శ్రీనిధి సెంటిమెంట్ గాను మారుతోంది. 'కేజీఎఫ్‌', 'హిట్'  రెండు భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లే. శ్రీనిధి న‌టించిన ఆ రెండు సినిమాలు భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News