అజిత్ రెమ్యూనరేషన్ ప్రాసెస్.. నెవ్వర్ బిఫోర్ రూల్స్!
లీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఆ యాక్షన్ ఎంటర్టైనర్.. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఆ మూవీకి గాను అజిత్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి గాను ఏకంగా రూ.165 కోట్లను రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు నంబర్ కోసం కాకుండా.. అజిత్ కు మేకర్స్ ఎలా చెల్లిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. కఠినమైన నియమ నిబంధనలు అజిత్ పెట్టారని తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
నివేదికల ప్రకారం, అజిత్ రెమ్యునరేషన్ అంతా వైట్ లోనే ఉంటుందట. తొలుత 10 శాతం అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ పై సంతకం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన మొత్తంలో ప్రతి నెల 15 కోట్ల రూపాయలు జమ చేయవలసి ఉంటుంది. అది కూడా ఐదో తారీకు కచ్చితంగా అజిత్ అకౌంట్లో పడిపోవాల్సిందే. డేట్ అంటే డేట్ అంట.
ఒక వేళ 5వ తేదీ సెలవు లేదా ఆదివారం వస్తే.. అది 4వ తేదీన ఖాతాలోకి డబ్బులు రావాలి. మినహాయింపులు ఉండవు. ఆలస్యం అస్సలు ఉండదు. ఇంతలో సినిమా పూర్తి అయినా.. వాయిదా డబ్బులు కచ్చితంగా 5వ తేదీన జమ అవాల్సిందేనట. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ మారగా.. కొందరు నెటిజన్లు షాక్ అయిపోతున్నారు.
అయితే అజిత్ రూల్స్ వల్ల మేకర్స్ కు నగదు ప్రవాహ సమస్య కచ్చితంగా వస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ ఎఫెక్ట్ కూడా ఉంటుదని అంటున్నారు. వడ్డీ రేట్లు.. నెలవారీ చెల్లింపులకు లింక్ ఉంటుందని కనుక.. వివిధ సమస్యలు తప్పవేమో అని అభిప్రాయపడుతున్నారు. అజిత్ తన మార్క్ చూపిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.
ఏదేమైనా ఇప్పుడు అజిత్ రెమ్యునరేషన్ కు సంబంధించిన విధానం, నిబంధనలు వైరల్ అవుతున్నా.. ఇందులో నిజమెంతో మాత్రం తెలియదు. ఒకవేళ నిజమైతే.. అజిత్ నెలవారీ రెమ్యూనరేషన్ ప్రాసెస్ వెనుక కారణం ఏంటి? వ్యూహాత్మకంగానే చేస్తున్నారా? లేక దాని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తడం కామన్.