రిస్క్ చేస్తున్న అజయ్ దేవగన్.. నష్టం తప్పదా?
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ వైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే.. మరోవైపు డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు.;
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ వైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే.. మరోవైపు డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. అంతేకాదు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. అయితే అలాంటి అజయ్ దేవగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన అభిమానులకి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అజయ్ దేవగన్ ఓ ఫ్లాఫ్ హీరోని పెట్టి కొత్త సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సినీ ఇండస్ట్రీ జనాలు ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తూ అజయ్ దేవగన్ రిస్క్ చేస్తున్నారా..? ఇలాంటి సమయంలో ఈ రిస్క్ లు అవసరమా? అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ అజయ్ దేవగన్ ఏ హీరోని పెట్టి సినిమా చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ తాజాగా ఒక కొత్త సినిమాను నిర్మించబోతున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాని థియేటర్లో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం హీరోగా సిద్ధాంత్ చతుర్వేదిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ ఇప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సిద్ధాంత్ చతుర్వేదిని పెట్టి అజయ్ దేవగన్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా సాహసమనే చెప్పాలి.ఎందుకంటే సిద్ధాంత్ చతుర్వేదికి ఇండస్ట్రీలో అంత గుర్తింపు అయితే లేదు. ఏదో అంతంత మాత్రంగా ఇండస్ట్రీలో రాణిస్తున్న సిద్ధాంత్ చతుర్వేదిని ప్రధాన పాత్రలో పెట్టి అజయ్ దేవగన్ సినిమా చేయడం నిజంగా రిస్క్ చేయడమే అంటున్నారు బీటౌన్ జనాలు.
సిద్ధాంత్ చతుర్వేదిని పెట్టి చేస్తున్న సినిమా పిరియాడిక్ యాక్షన్ జానర్ లో రాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నారట. అయితే ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయమని కొంతమంది అడుగుతున్నప్పటికీ అజయ్ దేవగన్ మాత్రం నిరాకరించాడట. ఇక నిర్మాతగా అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సిద్ధాంత్ చతుర్వేదితో పాటు మోహిత్ రైనా కూడా మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.అలాగే పిరియాడిక్ యాక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి రచయిత్రి నేహా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం బీటౌన్ లో వస్తున్న ఈ వార్తలు తెలిసిన చాలామంది నెటిజన్లు నెట్ఫ్లిక్స్ లో సినిమా హిట్ కొట్టడం అంటే అంత తేలికైన పని కాదు..ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమా హిట్ అవ్వాలంటే బలమైన మౌత్ టాక్ ఉండాలి. ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల పాజిటివ్ టాక్ ఉంటేనే నెట్ఫ్లిక్స్ లో ఆ సినిమా హిట్ అవుతుంది. అలాగే పేరున్న హీరో సినిమాలు అయితేనే హిట్ అవుతాయి. కానీ హీరోగా అంత గుర్తింపు లేని సిద్ధాంత్ చతుర్వేదిని హీరోగా పెట్టి నెట్ఫ్లిక్స్ లో సినిమాని రిలీజ్ చేయడం అనేది సాహసమనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా బెడిసి కొడితే అజయ్ దేవగన్ భారీగా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరిస్తున్నారు
మరి చూడాలి అజయ్ దేవగన్ నిర్మాతగా చేయబోయే ఈ సినిమా ఏమేరా ఫలితాన్ని ఇస్తుంది అనేది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు త్వరలోనే రాబోతున్నాయి.