క్రేజీ టైటిల్ ను సెట్ చేసిన అజయ్ భూపతి
ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవగా, అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందంటున్నారు.;
కొన్ని సినిమాలకు డైరెక్టర్లు క్రేజ్ తీసుకొస్తే మరికొన్ని సినిమాలకు హీరోలు క్రేజ్ ను తీసుకొస్తారు. కొన్ని చిత్రాలకు కాంబినేషన్లు హైప్ ను తీసుకొస్తే, మరికొన్ని సినిమాలకు చిత్ర టైటిల్ తో ఊహించని హైప్ వస్తుంది. ఇప్పుడలాంటి టైటిల్‌నే తన నెక్ట్స్ సినిమాకు ఎంచుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.
డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్
ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆర్ఎక్స్100 మంచి సక్సెస్ సాధించడంతో అజయ్ పేరు బాగా వినిపించింది. ఆ క్రేజ్ తోనే స్టార్ క్యాస్ట్ తో మహా సముద్రం అనే సినిమా చేస్తే అది కాస్తా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అజయ్ కు మరోసారి తనను ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది.
మంగళవారంతో కంబ్యాక్
ఆ టైమ్ లో తీసిన మంగళవారం సినిమా మంచి సక్సెస్ ను అందుకోగా, మంగళవారం తర్వాత అజయ్ భూపతిపై మళ్లీ నిర్మాతలకు నమ్మకమేర్పడింది. ఆ నమ్మకంతోనే తమ వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతల్ని అజయ్ కు అప్పగించింది ఘట్టమనేని ఫ్యామిలీ. కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ డెబ్యూ ఫిల్మ్ కు అజయ్ భూపతినే దర్శకత్వం వహించనున్నారు.
ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవగా, అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందంటున్నారు. అయితే ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. తిరుపతికి దగ్గరలో ఉన్న గ్రామమైన ఆ ఊరి చుట్టూ తిరిగే ప్రేమ కథను అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, ఇందులో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా యాక్షన్ కూడా ఉంటుందని, హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ రవీన్ ఠాండన్ కూతురు రషా తదానీ ఎంపికైందని, రీసెంట్ గా హీరో హీరోయిన్లపై ఫోటోషూట్ కూడా జరిగిందని అంటున్నారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చాలా కీలకమని, దాని కోసం ఓ సీనియర్ యాక్టర్ని సంప్రదించారని, ఆయన ఓకే అంటే సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుందని సమాచారం వినిపిస్తోంది.