అజనీష్ ఇలా సొంత పరిశ్రమలో కూడా జరిగి ఉండదు..!

అజనీష్ లోక్ నాథ్ అనగానే అందరికీ కాంతారా గుర్తుకొస్తుంది. ఐతే అతను కన్నడలో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అతను 2009 నుంచే కెరీర్ మొదలు పెట్టాడు.;

Update: 2025-04-19 13:37 GMT

బాక్సాఫీస్ దగ్గర సినిమాల మధ్య పోటీ కామనే. కానీ ఆ పోటీ తన సినిమాతో తనకే పోటీ వస్తే ఎలా ఉంటుంది. కాస్త విచిత్రంగానే అనిపించినా ఇది నిజం. హీరోలకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ల బిజినెస్ దెబ్బ తినే పని వాళ్లు చేయరు. దర్శకులు కూడా తాను డైరెక్ట్ చేసిన రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకోడు. ఇప్పటివరకు అది జరిగింది లేదు.

హీరోలు, దర్శకులు తప్ప మిగతా వారికి ఈ అవకాశం ఉంటుంది. ఈమధ్య ఒకేసారి రెండు సినిమాలు నిర్మించిన నిర్మాతలు కూడా తమ సినిమాల మధ్య పోటీని ఆహ్వానిస్తున్నారు. ఇక హీరోయిన్స్ కి కూడా వారు నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. దానికి వాళ్లు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది.

రెండు సినిమాలకు వేరే వేరే మ్యూజిక్ ఇచ్చినా కూడా ఆ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటుంది. ఇలా ఒకేసారి తమ సినిమాలను రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సినిమాతో తాము పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఐతే ఈ వీకెండ్ అది మళ్లీ రిపీట్ అయ్యింది. అది కూడా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ కి తెలుగులో చేసిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం విశేషం.

అజనీష్ లోక్ నాథ్ అనగానే అందరికీ కాంతారా గుర్తుకొస్తుంది. ఐతే అతను కన్నడలో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అతను 2009 నుంచే కెరీర్ మొదలు పెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. తెలుగులో అజనీష్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మంగళవారం సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే అదే అతని మొదటి సినిమా కాదు ఆల్రెడీ రష్మిక తొలి సినిమా కిరిక్ పార్టీకి అజనీష్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆ సినిమా తెలుగు రీమేక్ కి అతనే మ్యూజిక్ ఇచ్చాడు. దానితో పాటు సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాకు కూడా అజనీష్ మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అతన్ని కాంతారా తర్వాత ఎక్కువ గుర్తించడం మొదలు పెట్టారు.

ఈ వీకెండ్ అంటే గురువారం రిలీజైన ఓదెల 2, శుక్రవారం రిలీజైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి రెండు సినిమాలకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు. రెండు డిఫరెంట్ సినిమాలు రెండు సినిమాలకు అజనీష్ మ్యూజిక్ న్యాయం చేసిందని అంటున్నారు. సో అజనీష్ ఇలానే తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోవాలని మ్యూజిక్ లవర్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News