కేన్స్ ముందు ఐశ్వర్యా రాయ్ షాకులేంటి?
ఐశ్వర్యా రాయ్ ఎంట్రీని కేన్స్ అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. వరల్డ్ వైడ్ ఎంతమంది బ్యూటీలు వాక్ చేసినా? ఐశ్వర్య వాక్ చేసే సరికి ఆవేవ్ మరోలా ఉంటుంది.
బాలీవుడ్ నుంచి కేన్స్ ఫిలిం పెస్టివల్స్ కి ఏటా ఐశ్వర్యారాయ్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి ఎంత మంది భామలు పాల్గున్నా? ఐశ్వర్యా రాయ్ రెడ్ కార్పెట్ పై వాక్ చేయనిదే కేన్స్కి వన్నె రాదు. అంతగా కేన్స్ ఉత్సవాల్లో ఫేమస్ అయిన ఏకైక సెలబ్రిటీగా ఐశ్వర్యారాయ్ కి పేరుంది. 2002 నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసా గిస్తుంది. ఐశ్వర్యా రాయ్ ఎంట్రీని కేన్స్ అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. వరల్డ్ వైడ్ ఎంతమంది బ్యూటీలు వాక్ చేసినా? ఐశ్వర్య వాక్ చేసే సరికి ఆవేవ్ మరోలా ఉంటుంది.
అందుకే కేన్స్ అంటే ఐశ్వర్యా రాయ్...ఐష్ అంటూ కేన్స్ అన్నంతగా పాపులర్ అయింది. ఇటీవలే అట్టహాసంగా 77వ కేన్స్ ఫిల్మ్ పెస్టివల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ ఏడాది కూడా ఐశ్వర్యా రాయ్ హాజరయింది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో చిక్కిన ఐశ్వర్య రాయ్నిచూసి అభిమానులంతా షాక్ అయ్యారు. చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉంది. దీంతో ఆమె చేతికి ఏదో బలమైన గాయమైనట్లు తెలుస్తుంది.
పక్కనే కుమార్తె కూడా కనిపిస్తుంది. అయితే ఐశ్వర్య పట్టీ చూసి అభిమానులంతా వాపోతున్నారు. మా హీరోయిన్ కి ఏమైంది? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇలా గాయంతో వెళ్తే కేన్స్ రెట్ కార్పెట్ పై ఎలా నడుస్తుంది? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజమే హీరోయిన్ గాయంతో బయట కనిపిస్తేనే అభిమానులు విలవిలాడిపోతారు. అలాంటింది గాయంతో వాక్ చేస్తుందంటే? ఇంకెంత వాపోతారో చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ సారి ఐశ్వర్య కేన్స్ లో వాక్ చేసే అవకాశం లేదని మరికొంత మంది అంటున్నారు. ఏటా ప్రత్యేక హోదాలో హాజరవుతుంది కాబట్టి ఆ సంస్కృతిని బ్రేక్ చేయకూడదని... తప్పక హాజరవుతుంది తప్ప కార్పెట్ పై హొయలు పోవడానికి కాదంటున్నారు. మరి ఐశ్వర్య మెరిపించడానికి వెళ్తుందా? కమిటీ నిబంధన మేరకు వెళ్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ సినిమాలు కూడా తగ్గించిన సంగతి తెలిసిందే.