ఐశ్వర్య.. టాలీవుడ్ లో బిజీ బిజీగా..
ఇక మూడోది రవితేజ, హషిత్ గోలి సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం.
‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఐశ్వర్య రాజేష్‌కు తెలుగులో మళ్లీ గ్యాప్ వస్తుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె లైనప్ చూస్తే లెక్క వేరేలా ఉంది. సెప్టెంబర్‌లో సుమంత్‌తో ఒక సినిమా, డిసెంబర్‌లో నాగార్జునతో మరో సినిమా, సంక్రాంతికి రవితేజ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. అంటే నాలుగు నెలల వ్యవధిలో మూడు తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చింది.
ముందుగా సెప్టెంబర్ 11న ‘మహేంద్రగిరి వారాహి’ వస్తోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించారు. వరాహి దేవి, మహేంద్రగిరి ప్రాంతం, ఒక శాపం చుట్టూ మిస్టరీ, అడ్వెంచర్ కలిపిన కథగా ట్రైలర్‌ను కట్ చేశారు. సుమంత్, సంతోష్ గతంలో ‘సుబ్రహ్మణ్యపురం’ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే మిస్టరీ జోన్‌కు దగ్గరగా ఉన్న కథతో వస్తున్నారు.
దాని తర్వాత నాగార్జున ‘కింగ్ 100’లో కూడా ఐశ్వర్య నటిస్తోంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ వచ్చిన తర్వాత, దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమాలో తాను భాగమని ఐశ్వర్య కన్ఫర్మ్ చేసింది. ఆమె పాత్ర ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. సినిమా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది.
ఇక మూడోది రవితేజ, హషిత్ గోలి సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్‌ను రవితేజకు జోడీగా తీసుకున్నట్లు టాక్ వస్తోంది. శ్రీ విష్ణు కూడా మరో కీలక పాత్రలో ఉంటాడని సమాచారం. సినిమాను జనవరి 14, 2027కు ప్రకటించారు.
ఐశ్వర్యకు తెలుగులో ఇది ఒక విధంగా రెండో రౌండ్. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’ లాంటి సినిమాలు చేసినా ఇక్కడ వరుసగా పెద్ద కమర్షియల్ సినిమాలు రాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మాత్రం మళ్లీ తెలుగు నిర్మాతల దృష్టిలోకి వచ్చింది. ఇప్పుడు మూడు సినిమాల్లో మూడు వేర్వేరు హీరోలు. ఇక అనుకున్నట్లు జరిగితే గత సంక్రాంతి తర్వాత మొదలైన తెలుగు రన్ ఈసారి ఏడాది మొత్తం కొనసాగినట్టే అవుతుంది.