రోమాంచకంపై వంగా కాన్ఫిడెన్స్.. ఏ లెవెల్లో ఉందంటే..

ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మైక్ పట్టుకున్న ఆయన సినిమా మీద తనకున్న నమ్మకాన్ని చాలా క్యాజువల్ గా జనాలకు కనెక్ట్ అయ్యేలా పంచుకున్నారు.

Update: 2026-08-31 03:48 GMT

సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమాను సమర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పీచ్ ఈ వేడుకలో హైలెట్ గా నిలిచింది. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మైక్ పట్టుకున్న ఆయన సినిమా మీద తనకున్న నమ్మకాన్ని చాలా క్యాజువల్ గా జనాలకు కనెక్ట్ అయ్యేలా పంచుకున్నారు.

ముందుగా ఈ కథ విన్నప్పుడే తనకు చాలా నవ్వొచ్చిందని సందీప్ చెప్పారు. డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ఆరు నిమిషాల సీన్ తీసి చూపించాక ఆయన విజన్ మీద పూర్తి నమ్మకం కుదిరిందన్నారు. వాళ్లను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తాను ఒక్కరోజు కూడా సెట్స్ కు వెళ్లలేదని తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక ఫైనల్ కట్ చూస్తే వాళ్లు పడిన కష్టం తెరమీద అద్భుతంగా వర్కౌట్ అయిందని ప్రశంసించారు.

హీరో సుమంత్ ప్రభాస్ గురించి చెబుతూ అతడు ఒక రెగ్యులర్ హీరోలా, పక్కన సైడ్ కిక్ ఫ్రెండ్స్ ఉండేలా ప్రవర్తించలేదన్నారు. అందరితో సమానంగా కలిసిపోయి ఒక అమాయకమైన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పారు. హీరోయిన్ అనంతిక కూడా తన రోల్ కు వంద శాతం న్యాయం చేసిందన్నారు. చింటు, పొడుగు, సోహాన్ లాంటి కుర్రాళ్ళంతా తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారని మెచ్చుకున్నారు.

ఈ సినిమా కోసం టీమ్ పడిన కష్టాన్ని సందీప్ ఫన్నీగా వివరించారు. మే నెలలో చెన్నై ఎండల్లో షూటింగ్ చేస్తే టీమ్ అంతా ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ లో బిఫోర్ ఫోటోలాగా నల్లగా మారిపోయారని సరదాగా కామెంట్ చేశారు. సినిమాలో కామెడీ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడని తెలిపారు.

దర్శకుడు వేణుగోపాల్ రెడ్డికి సెప్టెంబర్ 3వ తేదీ ఒక కల నెరవేరే రోజు అని సందీప్ ఎమోషనల్ అయ్యారు. సెప్టెంబర్ 2 రాత్రి పడే ప్రీమియర్స్ అతడి జీవితంలో స్పెషల్ అని చెబుతూ తన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ తో కలిసి ఆగస్టు 24 రాత్రి అనుభవించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. చివరగా రోమాంచకం సినిమాను చూడటానికి వచ్చే ప్రేక్షకులకు సందీప్ ఒక గట్టి గ్యారెంటీ ఇచ్చారు. థియేటర్లో మీరు పెట్టే రెండున్నర గంటల సమయం, కొనే టికెట్ కు ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వదని హామీ ఇచ్చారు. థియేటర్స్ లో ఫుల్ గా నవ్వుకుంటూ బయటకు వస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈవెంట్ కు సపోర్ట్ చేసిన సునీల్ నారంగ్, డైరెక్టర్ శౌర్యలకు థాంక్స్ చెబుతూ స్పీచ్ ముగించారు.

Tags:    

Similar News