• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐశ్వ‌ర్యారాయ్ కారుని...

ఐశ్వ‌ర్యారాయ్ కారుని ఢీకొట్టిన బ‌స్సు.. ఆ త‌ర్వాత‌..!

| కానీ అదృష్టవశాత్తూ ఆ సమయంలో కార్ లో ఐశ్వ‌ర్యారాయ్ లేరు.

By - Tupaki Desk
Update: 2025-03-26 17:23 GMT

మాజీ ప్ర‌పంచ సుంద‌రి, అందాల క‌థానాయిక‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కారును బస్సు ఢీకొట్టింది. ఖ‌రీదైన బెంజ్ కార్ ని బ‌స్సు వెనుక నుంచి ఢీకొట్ట‌గా, రోడ్ మ‌ధ్య‌లో కార్ ని నిలిపివేసిన దృశ్యాలు ఇప్పుడు అంత‌టా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆ కార్ లో ఐశ్వ‌ర్యారాయ్ ఉన్నారా? త‌న‌కు ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించిందా? అంటూ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కానీ అదృష్టవశాత్తూ ఆ సమయంలో కార్ లో ఐశ్వ‌ర్యారాయ్ లేరు.

ఇండియా టుడే క‌థ‌నం ప్రకారం.. ఇది ఒక‌ చిన్న సంఘటన.. నిజానికి ఐష్ కి ఎలాంటి నష్టం ఏమీ లేదు. ఆమె క్షేమంగా ఉన్నారు. స‌న్నిహితులు ఎటువంటి ప్రమాదం జరగలేదని ధృవీకరించారు!. ప్ర‌మాద స్థ‌లంలో ఐశ్వ‌ర్యారాయ్ బెంజ్ కార్ కొద్దిసేపు ఆగినా, ఆ త‌ర్వాత గార్డులు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంతో అక్క‌డి నుంచి కార్ వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోల్లో క‌నిపిస్తున్నాయి. కార్ వెన‌క భాగంలో కొన్ని స్క్రాచ్ లు కూడా క‌నిపిస్తున్నాయి. బ‌స్ నెమ్మ‌దిగా వ‌చ్చి కార్ ని ర‌బ్ చేసింది. కానీ అది పూర్తిగా బ‌లంగా ఢీకొట్ట‌లేదు అని ఒక సోర్స్ స్పష్టం చేసింది. ఐష్ కార్ ని ఎర్ర బస్సు ఢీకొట్టినట్లు వీడియోల్లో క‌నిపిస్తోంది.

నిజానికి చాలా మీడియాలు అభిమానుల్ని నిజంగా కంగారు పెట్టాయి! ఐశ్వర్య రాయ్ బచ్చన్ కార్ ని బ‌స్సు ఢీకొట్టింద‌ని క‌థ‌నాలు వేయ‌డంతో అభిమానులు చాలా కంగారు ప‌డ్డారు. అభిమానులను ఈ ఘ‌ట‌న తీవ్ర‌ ఆందోళనలకు గురి చేసింది. కానీ ఆ త‌ర్వాత కార్ లో ఐష్ లేద‌ని తెలిసాక అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె అభిమానులు చాలా మంది తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒక నెటిజ‌న్ ``ఓ మై గాడ్!!! ఆమె క్షేమంగా ఉందని, బాగానే ఉందని ఆశిస్తున్నాను!`` అని వ్యాఖ్యానించారు. మరొకరు ``ఓరి దేవుడా.. ఆమె క్షేమంగా ఉందని ఆశిస్తున్నాను`` అని రాశారు.

ఐశ్వర్య రాయ్ భారతదేశంలో పాపుల‌ర్ న‌టి. 1994లో మిస్ వరల్డ్ కిరీటం పొందిన త్వరగా విజయవంతమైన నటనా కెరీర్ ని సాగిస్తోంది. బాలీవుడ్‌లో అత్యంత పాపుల‌ర్ తార‌ల్లో ఐష్ ఒక‌రు. మంత్రముగ్ధులను చేసే అందం, అసాధారణమైన నటన, అందమైన వ్యక్తిత్వం, తెలివితేటల‌తో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది. కొన్ని వారాల క్రితం ఐశ్వర్య రాయ్ త‌న‌ భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతోందంటూ ప్రచార సాగింది. ఈ పుకార్ల‌ను తిప్పి కొడుతూ ఈ జంట చాలాసార్లు ఈవెంట్లలో కలిసి కనిపించారు. తద్వారా విడాకుల పుకార్లను తిప్పికొట్టారు.

Tags:    
  • AishwaryaRai 
  • BollywoodNews 
  • ViralVideo 
  • RoadAccident 
  • MercedesBenz 
  • BusAccident 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS