విడాకుల పుకార్ల నడుమ విడాకుల కథతో?
ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ చాలా పుకార్లు వచ్చాయి. అయితే వీటన్నిటినీ ఈ దంపతులు వీలున్న అన్ని మార్గాల్లోను డీసెంట్ గా ఖండిస్తున్నారు.;
ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ చాలా పుకార్లు వచ్చాయి. అయితే వీటన్నిటినీ ఈ దంపతులు వీలున్న అన్ని మార్గాల్లోను డీసెంట్ గా ఖండిస్తున్నారు. ఇటీవల తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, వీడియోలు, స్వరాన్ని ఉపయోగించుకుని ఉచిత ప్రచారం కొట్టేస్తున్న యూట్యూబ్ వెబ్ మాధ్యమాలపై, తమకు డ్యామేజ్ చేస్తున్న అనధికారిక ప్రకటనకర్తలపై హక్కుల కోసం దావాలో కోర్టుల పరిధిలో పంతం నెగ్గించుకున్నారు ఐష్-అభి జంట.
పలుమార్లు ఈవెంట్లలో విడివిడిగా కనిపించిన ఈ జంట, తమపై వస్తున్న పుకార్ల విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఈ ప్రచారం కారణంగా కుమార్తె ఆరాధ్య డిస్ట్రబ్ అవుతోందని కూడా ఐష్ ఆవేదన చెందుతున్నట్టు కథనాలొచ్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ కలిసి జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారని కథనాలొస్తున్నాయి.
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్ జంటగా తెరకెక్కిన క్లాసిక్ చిత్రం `అభిమాన్`(1973) ని రీమేక్ చేయనున్నారని, ఇందులో అభిషేక్- ఐశ్వర్యారాయ్ జంటగా నటిస్తారని కథనాలొస్తున్నాయి. యాథృచ్ఛికంగా ఈ సినిమాలో కథాంశం కూడా పెళ్లి బ్రేకప్ గురించిన సమస్యపై సినిమా. సంసారం విచ్ఛిన్న దశలో, బ్రేకప్ పోరాటంలో ఉన్న గాయనిగాయకుల జంటకు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం `అభిమాన్-2025` రీమేక్ కి దర్శకుడు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ చిత్రం సెట్స్ పైకి వెళితే రావణ్ (2010) తర్వాత 15 సంవత్సరాలకు ఈ జంట రిపీటవుతున్నట్టు. విడాకుల పుకార్ల నడుమ ఐష్-అభి రిలేటెడ్ గా ఉన్న కథాంశాన్ని ఎంచుకోవడంలో నిజం ఎంత? ఈ ప్రాజెక్టును అధికారికంగా ధృవీకరించాకే తెలుస్తుంది.