'జైలర్ 2' రీషూట్స్ - వివాదాలకు చెక్!
సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.కొన్ని సన్నివేశాలు సున్నితమైన రాజకీయ అంశాలతో కూడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు ..సామాజిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ వర్గానికి లేదా రాజకీయ కోణానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే మేకర్స్ కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు సమాచారం.
రజనీకాంత్ ప్రతిష్టకు, సినిమా రన్‌కు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతోనే వివాదాస్పదంగా మారే అవకాశమున్న సీన్లకు కత్తెర వేసి.. కొత్త సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగు తోంది. `జైలర్` భారీ విజయం సాధించిన నేపథ్యంలో `జైలర్ 2` పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్-ఇండియా రేంజ్‌లో అందరినీ అలరించేలా కథనాన్ని మలచడం నెల్సన్‌కు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో రాజకీయం లేదా సున్నిత విషయాల జోలికి వెళ్లకుండా పక్కా యాక్షన్ ఎంటర్ టైన్‌మెంట్ కాన్సెప్ట్‌కే పెద్దపీట వేసేందుకు రీషూట్‌ల ద్వారా స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ `ధర్మన్`షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ కు హాజరవుతూనే రీ షూట్ పాల్గొనాల్సి ఉంటుంది. అయితే వివాదాస్పద సన్నివేశాలు ప్రత్యేకంగా ఎవరి పై షూట్ చేయాలి? అన్న దానిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది.
సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు సాంకేతిక బృందంతో పాటు విలక్షణమైన నటీనటులను రంగంలోకి దించుతున్నారు. అనిరుధ్ రవిచందర్ మళ్లీ తన మార్క్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రజనీ పాత్రను ఎలివేట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తొలి భాగాన్ని మించి ఉంటుందని సన్నిహితులు అంటు న్నారు. అలాగే సినిమాలో మలయాళ బ్యూటీ అన్నా రేష్మా రాజన్ లేడీ విలన్‌గా నటించడం సినిమాకు అదనపు అస్సెట్ గా కలిసొస్తుంది.
మరోవైపు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ చిత్రంలో అద్భుతమైన క్యామియో చేయను న్నారనే ప్రచారం సినిమాపై క్రేజ్‌ను రెట్టింపు చేస్తుంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు, హృతిక్ రోషన్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ `జైలర్ 2` పై అంచనాలను అంతకంతకు పెంచుతున్నాయి.