ఏఐ సినీ ఇండస్ట్రీకి నష్టం తప్పదా.. అసలేం జరుగుతోంది?

అయితే ఇది ఇలాగే కొనసాగితే సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడే వాళ్ళకి ఉపాధి కరువవుతుంది.;

Update: 2025-08-20 16:36 GMT

అవును మీరు వినేది నిజమే.. ఇకపై హీరో హీరోయిన్లతో అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎవరితో కూడా పని లేదు.ఏఐతోనే పని.. వింటుంటేనే భయంకరంగా అనిపిస్తుంది కదూ.. ఎందుకంటే ఎంతోమంది హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీ వల్ల బతుకుతున్నారు . అలాంటిది ఏఐ వల్ల హీరో హీరోయిన్లు అక్కర్లేకుండానే సినిమాలు తీసేస్తే ఇంకేమైనా ఉందా.. ? సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే..రీసెంట్ గా ఏఐ టెక్నాలజీని వాడి పురాణాల ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నట్టు బాలీవుడ్ నుండి ఒక ప్రకటన వచ్చింది..

ఈ కృత్రిమ మేధస్సుతో తీయబోయే సినిమాలో హీరో హీరోయిన్లు అక్కర్లేదు. కేవలం ఒక పెద్ద ఆఫీస్ సెటప్ అలాగే కంప్యూటర్లు,స్టాప్ ఉంటే చాలు సినిమా తీసేయవచ్చు. అలా రామాయణం, చిరంజీవి హనుమాన్ వంటి రెండు సినిమాలను ఏఐ టెక్నాలజీతో తీయబోతున్నట్టు ఈ మధ్యనే బీటౌన్ వర్గాలు తెలియజేశాయి. అయితే ఇందులో తప్పేముంది. రీసెంట్ గా యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ విడుదల అవ్వలేదా.. దానిలాగే ఉంటుంది కావచ్చు అని అనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే ఏఐ టెక్నాలజీతో రాబోతున్న సినిమాలో మహావతార్ మూవీలో లాగా వీఎఫ్ఎక్స్,యానిమేషన్స్ వంటివి కాకుండా పూర్తిగా ఏఐ మ్యాడ్యూల్ లోనే సినిమాని పూర్తి చేస్తారట. దీనికోసం అత్యధిక స్థాయిలో టూల్స్, సాఫ్ట్వేర్లు వంటి వాటిని వాడబోతున్నట్టు సమాచారం..

అయితే ఇది ఇలాగే కొనసాగితే సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడే వాళ్ళకి ఉపాధి కరువవుతుంది. కేవలం ఏఐ టెక్నాలజీ తెలిసిన వాళ్లు, కంప్యూటర్లు ఉంటే చాలు.. ఇక ఇంత మంది కార్మికులు అవసరం ఉండదు అంటున్నారు.

అయితే ఏఐ సినిమాలపై ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి అనురాగ్ కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీతో ఎమోషన్స్ పండించలేము. కేవలం మనుషుల ద్వారా మాత్రమే ఎమోషన్స్ పండుతాయి.చాలా మంది తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో ఇలా ఏఐ టెక్నాలజీని వాడి ప్రాణం లేని బొమ్మలను క్రియేట్ చేసి సినిమాలు తీసేసి ప్రేక్షకులను మోసం చేద్దాం అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. అంతేకాదు ఏఐ టెక్నాలజీతో రాబోతున్న చిరంజీవి హనుమాన్ మూవీ యూనిట్ పై కూడా ఆయన ఫైర్ అయ్యారు..

సినీ ప్రేక్షకులను మోసం చేసే ఇలాంటి వాటిని సపోర్ట్ చేయకూడదు అంటూ అని అనురాగ్ కశ్యప్ మాట్లాడారు. అయితే అనురాగ్ కశ్యప్ ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అనేది ఇండస్ట్రీలో పాతుకుపోతే ఇక సినిమాల్లో హీరో హీరోయిన్లు ఉండరు. కేవలం ఎలాంటి ఫీలింగ్స్ లేని బొమ్మల్ని మాత్రమే తెరపై చూడాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లను ఏఐ ద్వారా సృష్టించి సినిమాలు ఫినిష్ చేస్తారు. అలా అయితే అందరికీ ప్రమాదమే అంటున్నారు చాలామంది సినీ విశ్లేషకులు.ఏది ఏమైనప్పటికీ ఏఐ టెక్నాలజీ తో వచ్చే సినిమాలను ప్రోత్సహిస్తే సినీ ఇండస్ట్రీ మీద బతుకుతున్న చాలామంది పొట్ట కొట్టినట్లే..వాళ్లకు ఉపాధి కరువు అవుతుంది.. భవిష్యత్తులో ఈ ఏఐ పరిణామాలు ఇంకెలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News