మొత్తం AIపైనే డిపెండ్ అయితే ఎలా?

ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ఎమోషన్స్, పాత్రల మధ్య రిలేషన్, దర్శకుడి ఆలోచన, రైటర్ క్రియేటివిటీ వంటి అంశాలే సినిమాకు అసలు బలం.

Update: 2026-07-12 07:09 GMT

సినిమా అంటే ఒకప్పుడు స్టోరీ, యాక్టింగ్, ఎమోషన్స్. ఇప్పుడు వాటితో పాటు టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా ప్రొడక్షన్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఛేంజ్ ఎంతవరకు మంచిది? మొత్తం ఏఐపైనే ఆధారపడితే సినిమా అసలు సోల్ దెబ్బతింటుందా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.

ఇటీవల కొన్ని సినిమాల విషయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. పోస్టర్లు, టీజర్లు, విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సీన్స్ డిజైనింగ్ వరకు ఏఐ సహాయం తీసుకోవడం సాధారణంగా మారుతోంది. కానీ కొన్ని సందర్భాల్లో మేకర్స్ పూర్తిగా ఏఐనే నమ్ముతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాణంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించడంలో తప్పేమీ లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే దీని వల్ల టైమ్ సేవ్ కావడంతో పాటు కొన్ని వర్క్స్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విజువల్ వర్క్స్, కాన్సెప్ట్ డిజైన్లు, ప్రీవిజువలైజేషన్ వంటి అంశాల్లో ఏఐ మంచిగా ఉపయోగపడుతుంది. కానీ ప్రతి అంశాన్ని ఏఐతోనే చేయించాలని ప్రయత్నిస్తే సమస్యలు వస్తాయని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే సినిమా అనేది కేవలం అందమైన విజువల్స్‌ తో మాత్రమే నిలబడదు.

ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ఎమోషన్స్, పాత్రల మధ్య రిలేషన్, దర్శకుడి ఆలోచన, రైటర్ క్రియేటివిటీ వంటి అంశాలే సినిమాకు అసలు బలం. ఇవి తగ్గిపోతే ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా ప్రేక్షకులకు సినిమా పూర్తిగా కనెక్ట్ కావడం కష్టమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రియాలిటీ ఫీల్ తగ్గిపోతే ప్రేక్షకుడు వెంటనే గుర్తించే పరిస్థితి ఉంటుంది. నేచురాలిటీ లేకుండా కనిపించే విజువల్స్, ఆర్టిఫీషియల్ గా అనిపించే సన్నివేశాలు సినిమాపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అందుకే ఏఐని ఒక హెల్పర్ గా మాత్రమే చూడాలని, దానిని పూర్తిగా ప్రత్యామ్నాయంగా మార్చకూడదని సినీ ప్రియులు అంటున్నారు.

మరోవైపు ఏఐ వినియోగం పెరగడంతో క్రియేటివిటీ విషయంలో ఆందోళన కనిపిస్తోంది. రైటర్లు, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, డిజైనర్లు, గ్రాఫిక్స్ టెక్నీషియన్ల పాత్ర మెల్లగా తగ్గిపోతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టెక్నాలజీ హెల్ప్ గా ఉండాలే గానీ, హ్యామన్ ప్లేస్ ను పూర్తిగా ఆక్యుపై చేసే రేంజ్ కు వెళ్లకూడదని అభిప్రాయపడుతున్నారు. నిజానికి వరల్డ్ వైడ్ గా కొన్ని సినీ ఇండస్ట్రీలు అవసరమైన చోట ఏఐను వినియోగిస్తూ, మిగిలిన చోట హ్యూమన్ క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అలా చేస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు.

ఏదేమైనా ఏఐ సినిమా ప్రొడక్షన్ కు ఉపయోగపడే పవర్ ఫుల్ ఎలిమెంట్ అనడంలో సందేహం లేదు. కానీ కథ, ఎమోషన్స్, నేచురాలిటీ, క్రియేటివిటీ వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టి మొత్తం ఏఐపైనే ఆధారపడితే సినిమా అసలు బలం దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ప్రేక్షకుడిని చివరకు ఆకట్టుకునేది హ్యూమన్ ఐడియాతో పుట్టిన నిజమైన కథే అని సినీ ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News