వీడియో : 'పెద్ది' చికిరి బెస్ట్ AI వర్షన్ చూశారా?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.;
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 2026 సమ్మర్‌లో మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇంకా విడుదలకు దాదాపుగా నాలుగు నెలల సమయం ఉంది. అయినప్పటికీ బుచ్చిబాబు సందడి మొదలు పెట్టాడు. ఈ స్పోర్ట్స్ డ్రామా నుంచి ఇప్పటికే వచ్చిన మొదటి షాట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని ముందుకు వెళ్లి మరీ కొట్టిన షాట్ కి అంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. అప్పటి నుంచి పెద్ది సినిమాను చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలను మరింతగా పెంచే విధంగా చికిరి చికిరి అంటూ సాంగ్ వచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. ఈ పాట మొత్తం సినిమా స్థాయిని రెట్టింపు చేసింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా...
జాన్వీ కపూర్ పాత్రను చూపిస్తూ, రామ్ చరణ్‌తో పాడించిన ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. రామ్ చరణ్ డాన్స్ స్కిల్స్ మరోసారి ఈ పాట చూపించింది. ఇక సినిమాలో జాన్వీ కపూర్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ బుచ్చిబాబు ఈ పాటలో ఆమె విజువల్స్‌ను ఇవ్వడం జరిగింది. జాన్వీ కపూర్ గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా, పల్లెటూరి అమ్మాయిగా చూపడం ద్వారా ఆమె అభిమానులకు కన్నుల విందు చేయడం జరిగింది. చికిరి పాటకు లక్షల మంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారు, ముసలి వారి వరకు అంతా చికిరి చికిరి అంటూ బ్యాట్ స్టెప్ వేయడం, రకరకాలుగా మూమెంట్స్ చేయడం ద్వారా పాట వైరల్ అయింది. ఇప్పుడు పాట గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఒక AI వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పెద్ది లోని చికిరి చికిరి సాంగ్...
గత కొన్ని నెలలుగా AI అనేది సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క స్టార్‌ను AI ద్వారా క్రియేట్ చేసి ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. అయితే చికిరి చికిరి పాటకు AI వర్షన్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భలే చేశారే అని రామ్ చరణ్ ఫ్యాన్స్, జాన్వీ కపూర్ ఫ్యాన్స్‌తో పాటు సినిమాపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఏఐ వర్షన్‌ను ఈ వీడియోలో చూపిస్తూ, లిరిక్స్‌కి తగ్గట్లుగా యాక్ట్ చేయించడం ద్వారా బెస్ట్ ఏఐ వీడియోగా ఈ వీడియో గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటి వరకు చికిరి చికిరి అంటూ చాలా వీడియోలు వచ్చాయి. రీల్స్ రూపంలో వచ్చిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇలా ఏఐ ద్వారా వీడియో రావడం అందరికీ సర్‌ప్రైజింగ్‌గా అనిపించి తెగ చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏఆర్ రహమాన్ సాంగ్ అదిరింది...
రామ్ చరణ్‌ను గేమ్ ఛేంజర్ తర్వాత అభిమానులు ఈ సినిమాలో చాలా విభిన్నంగా చూడబోతున్నారు. గతంలో చరణ్ నటించిన రంగస్థలంను మించి ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాలోని ఆయన లుక్, పాత్రను బుచ్చిబాబు ప్రాణం పెట్టి డిజైన్ చేశాడని మేకర్స్ అంటున్నారు. మొదటి నుంచి ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అన్నట్లుగానే ఆయన నుంచి వచ్చిన మొదటి పాట సెన్షేషన్ క్రియేట్ చేసింది. ముందు ముందు రాబోతున్న పాటలతో సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ జరుపుతున్న బుచ్చిబాబు ఈ సినిమాను అనుకున్న తేదీకి ఇవ్వాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. 2026 మార్చి చివరి వారంలో ఖచ్చితంగా సినిమా వచ్చి తీరుతుందని మేకర్స్ నుంచి కూడా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెంచే విధంగా చికిరి హిట్ కావడంతో మేకర్స్ మరింత ఉత్సాహంగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.