'సైయారా' జంట గుట్టు మట్లు లీక్ చేసిన సన్నిహితుడు
ఎంతో అమాయకంగా కనిపించే అనీత్ పద్దాకు ఇక్కడ అంతగా సహకారి కానీ స్నేహితుడు కానీ ఎవరూ లేరు. కానీ అహాన్ అన్నిటినీ ఇచ్చాడు. తనను బాగా చూసుకున్నాడు. అతడి ప్రేమకు ఆమె ఫిదా అయిపోయింది.;
కొన్ని ప్రేమకథలు విలక్షణమైనవి. స్నేహం ప్రేమగా మారుతుంది. వదిలి ఉండలేనంతగా బంధం పెనవేసుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమ వికసిస్తుంది. అది ఎన్నటికీ వీడని బంధంగా మారుతుంది. ఇప్పుడు అలాంటి ఒక బంధంలో ఉన్నారు అహాన్ పాండే- అనీత్ పద్దా. అమాయకురాలైన అందమైన యువతి అనీత్ తో ఫిల్మీ నేపథ్యం ఉన్న యువ నటుడు అహాన్ పాండే నిండా ప్రేమలో మునిగాడు.
`సైయారా` సెట్లో పరిచయం స్నేహంగా మారింది. చివరికి ప్రేమగా మారింది. అది ఎంతగా అంటే వదిలి ఉండలేనంతగా. ఈ ప్రేమ ప్రతిఫలం ఎదురేలేని బ్లాక్ బస్టర్ కొట్టేంతగా వర్కవుటైంది. అటు కెరీర్ కి, ఇటు వ్యక్తిగత ప్రేమైక జీవనానికి రెండిటికీ ఇది నాందిగా మారింది. ఈ జంట అందమైన ప్రేమకథ గురించి ఇప్పుడు సైయారా నిర్మాత ఆదిత్య చోప్రా సన్నిహితుడు ఒకరు చెప్పిన నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఎంతో అమాయకంగా కనిపించే అనీత్ పద్దాకు ఇక్కడ అంతగా సహకారి కానీ స్నేహితుడు కానీ ఎవరూ లేరు. కానీ అహాన్ అన్నిటినీ ఇచ్చాడు. తనను బాగా చూసుకున్నాడు. అతడి ప్రేమకు ఆమె ఫిదా అయిపోయింది. మనసిచ్చేసింది. ఆ ఇద్దరూ సెట్లో ఉండగానే ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఈ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది అని చోప్రా సన్నిహితుడు చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. తెరపై ప్రేమకథలో విజయం సాధించడమే కాదు, నిజ జీవితంలో కూడా వారు తమ ప్రేమకథను గెలిపించుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
వారిది సహజ ప్రేమ.. నిబద్ధతతో కూడుకున్న ప్రేమకథ. అయినా ప్రస్తుతానికి కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు గనుక దీనిని రహస్యంగా ఉంచుతున్నారు. డేటింగ్ వ్యవహారాన్ని ఉద్ధేశపూర్వకంగానే దాచి ఉంచారని అతడు చెప్పారు. అహాన్ , అనీత్ ప్రస్తుతం తమ తదుపరి కెరీర్ పై మాత్రమే దృష్టి సారించారు. తొందర్లోనే ఇతర ప్రాజెక్టుల గురించి ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.