• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుకున్నట్లే మంచి...

అనుకున్నట్లే మంచి ప్రాజెక్ట్ పట్టేసిన బేబీ

| ఓవైపు తన సొంత బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై డిఫరెంట్ మూవీస్ ని రూపొందిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-28 12:15 GMT

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఓవైపు బడా హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను సైతం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఓవైపు తన సొంత బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై డిఫరెంట్ మూవీస్ ని రూపొందిస్తున్నారు.

ఈ నిర్మాణ సంస్థలో మొదటగా రూపొందిన 'బలగం' మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇక తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగమల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శిరీష్ సరసన బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా నేషనల్ అవార్డు విన్నర్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. కాగా ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

దీనితో తన సోదరుడి కొడుకుని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఓ డిఫరెంట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'లవ్ మీ' అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి చైతన్యకి మూడవ సినిమానే దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్ లో ఛాన్స్ రావడం విశేషం. బేబీ మూవీలో తన పర్ఫామెన్స్ తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ తో మరో సినిమా చేస్తోంది.

ఆ ప్రాజెక్టును ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో ఆశిష్ రెడ్డికి జోడిగా నటిస్తుండడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇక ఆశిష్ రెడ్డి ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే సినిమాలో నటిస్తున్నాడు. లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • Tollywood 
  • Dilraju 
  • Venkateswaracreations 
  • Balagammovie 
  • Sirish 
  • Ashishreddy 
  • Arunbhimavarapu 
  • Vaishnavichaitanya 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS