• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  20 ఏళ్లైనా అమ్మడిలో ఆ...

20 ఏళ్లైనా అమ్మడిలో ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు..!

| పుష్ప 1 సూపర్ హిట్ కాగా ఇద్దరు కలిసి పుష్ప 2 అంటూ మరో సెన్సేషన్ కు సిద్ధమయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-05-08 11:26 GMT

ఆర్య సినిమా 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఒక స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో ఆ సినిమాకు పనిచేసిన వారంతా కూడా దాదాపు అటెండ్ అయ్యారు. ఆర్య సినిమా డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా 20 ఏళ్ల తర్వాత కూడా కలిసి మరో సినిమా చేస్తున్నారు. పుష్ప 1 సూపర్ హిట్ కాగా ఇద్దరు కలిసి పుష్ప 2 అంటూ మరో సెన్సేషన్ కు సిద్ధమయ్యారు.

20 ఏళ్ల తర్వాత ఆర్య షూటింగ్ విషయాలు.. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెబుతూ చిత్ర యూనిట్ అంతా ఆరోజుల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అభినయశ్రీ స్టేజ్ మీద కాలు కదిపింది. అ అంటే అమలాపురం సాంగ్ బిట్ కి ఆమె డ్యాన్స్ వేసింది. అభినయశ్రీ లో ఆ గ్రేస్ 20 ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంది. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా అన్నారు.

శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో షూట్ చేసిన అ అంటే అమలాపురం సాంగ్ లో ఆ స్టెప్పులు అభినయశ్రీ ఇలా వచ్చి అలా వేసేదని.. తానే దాదాపు రెండు గంటల దాకా ప్రాక్టీస్ చేశానని అన్నారు అల్లు అర్జున్. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని అన్నారు అల్లు అర్జున్.

ఇదే కార్యక్రమంలో అల్లు అర్జున్ ఆర్య విషయంలో వి.వి.వినాయక్ మాట సాయం కూడా ఉందని అన్నారు. తొలి సినిమా అవ్వడం వల్ల సుకుమార్ చేయగలడా లేడా అన్న డౌట్ అల్లు అరవింద్ కు ఉండటంతో మీకెందుకు సార్ కుర్రాడు బాగా తీస్తాడు. ఒకవేళ మధ్యలో డౌట్ వస్తే చెప్పండి నేను వచ్చి చేస్తానని అన్నారట. అలా ఆర్య తాను చేసేందుకు ధైర్యం ఇచ్చిన వినాయక్ అన్నయ్యకు థాంక్స్ అని అన్నారు అల్లు అర్జున్.

ఈవెంట్ లో భాగంగా యాంకర్ అల్లు అర్జున్ ని మీరు వన్ సైడ్ లవ్ చేసింది ఎవరని అడిగింది. దానికి స్నేహానే అన్నారు అల్లు అర్జున్. ఆమెను ఇప్పుడు కాదు ఎప్పుడు వన్ సైడ్ లవ్వే అని అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని వన్ సైడ్ లవ్ చేయడం ఏంటని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ మాటల్లో అర్థం ఆమెను ఎంత ప్రేమించిన సరిపోదన్నట్టు అర్ధం అన్నట్టుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.



Tags:    
  • Tollywood 
  • Aarya 
  • Alluarjun 
  • Sukumar 
  • DilRaju 
  • DeviSriPrasad 
  • Abhinayashree 
  • AaAnteAmalapuramSong 
  • Event 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS