డబ్బింగ్ టెస్ట్‌లో శేష్.. ఏ సినిమా కోసమంటే
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను హీరో అడివి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.;
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా సినిమా వచ్చి రెండేళ్లు దాటి పోయింది. శేష్ హీరోగా ఆఖరిగా వచ్చిన సినిమా హిట్2. ఆ తర్వాత నుంచి గూఢచారి2, డెకాయిట్ సినిమాలపై వర్క్ చేస్తున్న శేష్, ఇప్పటికీ వాటిలో ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేసింది లేదు. రీసెంట్ గా హిట్3 లో కనిపించాడు కానీ అందులో శేష్ గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు.
ప్రస్తుతం శేష్ చేస్తున్న రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకత్వంల వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్న స్టూడియోస్ సమర్ఫణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునల్ నారంగ్ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.
డెకాయిట్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుందని మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను హీరో అడివి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డెకాయిట్ కు డబ్బింగ్ టెస్ట్ జరిగిందని, ఎల్లుండి నుంచి మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని చెప్తూ ఓ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటోలో శేష్ ఎంతో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం శేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ ను అనుకుని కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శృతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి మృణాల్ వచ్చింది. డెకాయిట్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల నటిస్తున్నాడు.