G2: ఫైనల్ గా రెండో గుడాచారి వచ్చేది ఎప్పుడంటే..

స్పై యాక్షన్ థ్రిల్లర్ల ట్రెండ్‌ను మార్చేసిన ‘గుడాచారి’కు కొనసాగింపుగా వస్తున్న ‘G2’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.;

Update: 2025-08-04 14:47 GMT

స్పై యాక్షన్ థ్రిల్లర్ల ట్రెండ్‌ను మార్చేసిన ‘గుడాచారి’కు కొనసాగింపుగా వస్తున్న ‘G2’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. అడివి శేష్‌ కొత్తగా కనిపించే సినిమాలకే కాదు, తన కథా ఎంపికలతో యూత్‌ను, మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించే హీరోగా పేరు తెచ్చుకున్నారు. ‘గుడాచారి’ మిస్టరీ, యాక్షన్, ఎమోషన్‌తో మిలియన్ డాలర్ మూవీగా నిలిచిన తర్వాత, ‘G2’ కోసం ఎదురు చూపులు పెరిగాయి. ఇక ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తవుతుందా, విడుదల తేదీ ఎప్పుడు అనేది అభిమానుల్లో ప్రధానంగా ఉంది.

ఇప్పటివరకూ యాక్షన్ సీక్వెన్స్‌లతో, ఇంటెన్స్ పోస్టర్లతో, అడివి శేష్‌ లుక్‌తో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ పలు అప్‌డేట్స్ అందించారు. కొత్త దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం ప్రకటించింది.

ఇక, అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌కి సంబంధించి ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. ‘G2’ గుడాచారి 2 మూవీ 2026 మే 1న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండటంతో ఇది రియల్ పాన్ ఇండియా మూవీస్‌లో ఒకటిగా నిలిచే అవకాశముంది. 6 దేశాల్లో, 23 భారీ సెట్లపై, 150 రోజులకు పైగా షూట్ చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు ఇండియన్ యాక్షన్ సినిమాల్లో ఎన్నడూ చూడని స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలోని క్యాస్టింగ్ కూడా ప్రత్యేకంగా ఉంది. అడివి శేష్‌కు జోడిగా వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ మరో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ మిక్స్‌తో కథ మరింత ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతోందని అప్‌డేట్స్ చెబుతున్నాయి. ఇక శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా అబ్బూరి రవి డైలాగ్స్ సమకూర్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి క్రేజీ బ్యానర్లు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సినిమాకు బిగ్ అట్రాక్షన్.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో అడివి శేష్‌ స్టైలిష్ లుక్, ఇంటెన్స్ మూడ్, గన్స్, యాక్షన్ విజువల్స్, రిఫ్లెక్షన్స్, బ్లాక్ అండ్ రెడ్ టోన్ వెరైటీగా ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో షూట్ చేసిన సీన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. దాదాపు రెండేళ్ల కష్టంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌లో అడివి శేష్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News