నాగచైతన్య పెళ్లిలో డెకాయిట్ చర్చ.. స్టోరీ చెప్పిన అడివి శేష్!
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’గా మన ముందుకు రాబోతున్నాడు.;
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’గా మన ముందుకు రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో అడివి శేష్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా నాగచైతన్య పెళ్లి వేడుకలో ఈ సినిమా కథ ఎలా మొదలైందో, 'హలో బ్రదర్' సాంగ్ రీమిక్స్ వివాదం వెనుక అసలు నిజమేంటో క్లారిటీ ఇచ్చారు..ఆ విశేషాలు చూద్దాం ..
నాగచైతన్య పెళ్లిలో మొదలైన చర్చ - అనురాగ్ కశ్యప్ ఎంట్రీ:
ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారనేది చాలా ఇంట్రెస్టింగ్. నాగచైతన్య పెళ్లి వేడుకలో అనురాగ్ కశ్యప్‌ను కలిసిన అడివి శేష్, అక్కడే ఈ ‘డెకాయిట్’ కథను వినిపించారట. ఇక కథలోని ఎమోషన్ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సుమారు 149 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, విడిపోయిన ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని శేష్ చెప్పుకొచ్చారు.
కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ వివాదం - క్లారిటీ ఇచ్చిన సుప్రియ:
ఈ సినిమాలో 'హలో బ్రదర్' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘కన్నెపెట్టరో కన్ను కొట్టరో’ను రీమిక్స్ చేశారు. అయితే దీనిపై సంగీత దర్శకుడు కోటి అసహనం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది. దీనిపై నిర్మాత సుప్రియ స్పందిస్తూ.. ఈ పాట హక్కులు ఆదిత్య మ్యూజిక్ దగ్గర ఉన్నాయని, తాము వారి నుండి అధికారికంగా పర్మిషన్ తీసుకున్నామని తెలిపారు. ఇక కోటి గారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడామని, ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణిగిందని ఆమె స్పష్టం చేశారు. ఈ పాటను గ్యాని అద్భుతంగా రీమిక్స్ చేశారని, సినిమాకు ఇది పెద్ద ఆకర్షణ కానుందని వెల్లడించారు.
మూడేళ్ల తర్వాత వస్తున్న హీరో:
ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ల జోడీతో పాటు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు నటిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఇప్పటికే విడుదలైన ‘రుబారు’ సాంగ్ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని అద్భుతంగా ఆవిష్కరించి, వెండితెరపై ఈ జంటను చూడాలనే కుతూహలాన్ని ఫ్యాన్స్‌లో నింపింది. 2022లో ‘హిట్: ది సెకండ్ కేస్’తో భారీ విజయాన్ని అందుకున్న శేష్, దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ‘డెకాయిట్’తో వస్తుండటం విశేషం. ఇక ఏప్రిల్ 10న సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఈ మూవీ, అటు యాక్షన్ ప్రియులను, ఇటు లవ్ స్టోరీ ఇష్టపడే వారిని ఏ మేరకు అలరించి వసూళ్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి.