టాలీవుడ్ స్పై కి మూడేళ్లు గ్యాప్ అయితే ఎలా?
యంగ్ హీరో అడవి శేష్ నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. చివరిగా 2022లో 'హిట్ ది సెకెండ్ కేస్' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు.;
యంగ్ హీరో అడవి శేష్ నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. చివరిగా 2022లో 'హిట్ ది సెకెండ్ కేస్' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. నాని నటించిన `హిట్ ది థర్డ్ కేస్` లో గెస్ట్ రోల్ లో మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హీరోగా మాత్రం ఇంత వరకూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. వరుస విజయాలతో పుల్ ఫామ్ లో ఉన్నా సినిమాలు రిలీజ్ చేయడంలో మాత్రం ఆలస్యమవుతున్నాడు. 'ఎవరు', 'మేజర్', 'హిట్' లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు.
ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ప్రయాణం మొదలు పెట్టినా? రిలీజ్ లు మాత్రం ఆలస్యమ వుతున్నాయి. కానీ లైన్ ప్ లో ఉన్న సినిమాలు మాత్రం గ్యారెంటీ హిట్ అనే టాక్ బలంగా ఉంది. ప్రస్తుతం శేష్ హీరోగా 'డెకాయిట్ 'తెరకెక్కుతోంది. కొంత కాలంగా సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని చెక్కుతున్నాడు. పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ఆలస్యమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇదే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే 'గుఢచారి'కి సీక్వెల్ గా 'గుఢచారి 2' కూడా ఇదే తరహలో నత్త నడకన షూటింగ్ సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. థ్రిల్లర్ కంటెంట్ కావడంతోనే ఈ రేంజ్ లో బజ్ నెలకొంది. ఈ రెండు సినిమాలకు శేష్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు.
ఓవైపు నటుడిగా పనిచేస్తూనే అవసరం మేర సెట్స్ సన్నివేశాలు మార్పులు చేర్పుల కోసం పని చేస్తున్నాడు. షూటింగ్ కూడా నెమ్మదిగా సాగడంతోనే రిలీజ్ లు ఆలస్యమవుతోంది. ఎలా లేదన్నా 2025 ముగింపుకల్లా మాత్రం రిలీజ్ లాంఛనమే. మళ్లీ వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేస్తే పాన్ ఇండియా రిలీజ్ లతో పోటీ పడాల్సి ఉంటుంది.