డెకాయిట్ అదిరిపోయే డీల్.. డిమాండ్ మామూలుగా లేదు!

అడివి శేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఎనౌన్స్ మెంట్ నుంచే క్యూరియసిటీ క్రియేట్ చేస్తుంటాడు.;

Update: 2025-05-24 12:34 GMT

అడివి శేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఎనౌన్స్ మెంట్ నుంచే క్యూరియసిటీ క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీలోను తన మార్క్‌ను చూపే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న శేష్ ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. వాటిలో “డెకాయిట్” అనే సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

శనీల్ దియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అనుపూర్ణ స్టూడియోస్ ప్రెజెంటేషన్‌లో, సునీల్ నారంగ్ సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా కథన పరంగా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉండనుందని సమాచారం. అదే సమయంలో శేష్‌కు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా కూడా మారబోతోంది. తొలి గ్లింప్స్ మే 26న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి భారీ మ్యూజిక్ రైట్స్ డీల్ కుదిరిన విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ మ్యూజిక్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు మరియు హిందీ ఆడియో రైట్స్‌ను ఏకంగా రూ.8 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదే అడివి శేష్ కెరీర్‌లో ఇప్పటి వరకూ జరిగిన మ్యూజిక్ రైట్స్ డీల్స్‌లో అతిపెద్దదిగా నిలిచింది.

శేష్ సినిమాలపై హిందీలోనూ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సోనీ మ్యూజిక్ ఇలా భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా భీమ్స్ పని చేస్తున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్‌తో టాప్ ఫామ్‌లో ఉన్నారు. మాస్, మెలోడి కలబోసే సంగీతాన్ని అందించే భీమ్స్ శేష్అన్ వాయిస్‌కి సరిపోయేలా మంచి ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్టు టాక్.

మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓ స్పెషల్ ఎలిమెంట్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని 2025 మొదటి భాగంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కథ, స్టైలిష్ ప్రెజెంటేషన్, క్రేజీ స్టార్ కాస్ట్‌తో “డెకాయిట్” ఈ ఏడాది హైప్ ఉన్న సినిమాల్లో ఒకటిగా మారింది. ఫస్ట్ గ్లింప్స్ తర్వాత హైప్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News