3 గంటలు నవ్వించడం వేరు.. సినిమా నడిపించడం వేరా?

కామెడీ షోతో గంటల తరబడి ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ అదే కామెడీని తీసుకుని మూడు గంటల సినిమాను నడిపించడం మాత్రం ఇంకా పెద్ద ఛాలెంజ్.

Update: 2026-09-11 01:56 GMT

కామెడీ షోతో గంటల తరబడి ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ అదే కామెడీని తీసుకుని మూడు గంటల సినిమాను నడిపించడం మాత్రం ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిబేట్ ను మొదలుపెట్టేలా చేసింది. ముఖ్యంగా కమెడియన్ సమయ్ రైనా గురించి డైరెక్టర్ అదిత్య హసన్ చేసిన కామెంట్స్ ఆ డిఫరెన్స్‌ ను మరోసారి హాట్ టాపిక్ గా మార్చాయి.

90స్ వెబ్ సిరీస్‌ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అదిత్య హసన్ ఇప్పుడు ఎపిక్ సినిమాతో దర్శకుడిగా తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఆ సినిమా రిలీజ్ కానుండగా, ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా సినిమా రైటింగ్ గురించి మాట్లాడిన ఆయన.. సమయ్ రైనా విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి.. ప్రస్తుత జెనరేషన్ ఆడియన్స్ లో సమయ్ రైనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన కామెడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అలాంటి జోక్స్‌ తోనే ఒక సినిమాను రాయడం చాలా కష్టమని అదిత్య హసన్ అభిప్రాయపడ్డారు. సినిమా అంటే కేవలం వరుసగా జోక్స్ చెప్పడం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఇక్కడే స్టేజ్ కామెడీకి, సినిమాకు అసలు తేడా కనిపిస్తుంది. ఒక కామెడీ షోలో ప్రేక్షకుడు ముందే నవ్వడానికి రెడీగా వస్తాడు. కమెడియన్‌ తో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాడు. ఒక జోక్ పేలితే వెంటనే రియాక్షన్ వస్తుంది. ఆ ఫ్లోలో మరో జోక్.. ఇంకో జోక్ అంటూ షోను ముందుకు తీసుకెళ్లొచ్చు.

కానీ సినిమా పరిస్థితి అలా ఉండదు. థియేటర్‌ లో ప్రేక్షకుడు మూడు గంటలు కూర్చోవాలంటే కేవలం నవ్విస్తే సరిపోదు. స్టోరీపై ఇంట్రెస్ట్ కలగాలి. రోల్స్ తో కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి. ఎమోషన్ కూడా పనిచేయాలి. ముఖ్యంగా ఒక జోక్ ఎందుకు వచ్చింది? ఆ సీన్‌ కు దాని అవసరం ఏమిటి? అనే విషయం కూడా కథలో భాగంగా ఉండాలి. అదిత్య హసన్ చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇదే. ఒక్కోసారి టీజర్ లేదా ట్రైలర్‌ లో ఒక జోక్ అంతగా పేలకపోవచ్చు.

కానీ పూర్తి సినిమా చూసిన తర్వాత అదే జోక్ చాలా బాగా కనెక్ట్ కావచ్చు. కారణం కాంటెక్స్ట్. ఆ రోల్ ఎవరు? ఆ పరిస్థితి ఏంటి? అప్పటివరకు కథ ఎలా వచ్చింది? అనే విషయాలు తెలిసిన తర్వాతే కామెడీకి అసలు అర్థం వస్తుంది. అందుకే సమయ్ రైనా లాంటి టాప్ కమెడియన్ ప్రేక్షకులను గంటల తరబడి ఎంటర్టైన్ చేయగలిగినా.. అదే రేంజ్ లో మూడు గంటల సినిమాను జోక్స్‌ తో నడపడం చాలా కష్టమని ఆదిత్య లాజిక్.

ఒక కామెడీ షోను ఎంటర్టైన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్, ఒక పూర్తి సినిమాను రాయడానికి కావాల్సిన స్కిల్స్ ఒకటి కావు. అంటే కామెడీ తక్కువ అని కాదు.. సినిమా పెద్ద ఛాలెంజ్ అని. జోక్ ప్రేక్షకుడిని కొన్ని మినిట్స్ నవ్విస్తుంది. కానీ కథే ప్రేక్షకుడిని చివరి వరకు థియేటర్‌ లో కూర్చోబెడుతుంది. అందుకే మూడు గంటలు నవ్వించడం వేరు.. మూడు గంటలు సినిమా నడిపించడం వేరనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది.

Tags:    

Similar News