మహేష్‌ను ఫోటో అడిగితే నో అన్నాడు..!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు.;

Update: 2025-06-05 12:50 GMT

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయన అభిమానుల్లో సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉంటారు. గతంలో పలువురు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ తమకు మహేష్ బాబు అంటే ఇష్టం అని అన్నారు. అంతే కాకుండా కొందరు మహేష్ బాబు అంటే తమకు క్రష్ అని కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఆయనతో సినిమాలు చేయాలని ఎంతో మంది హీరోయిన్స్ కోరుకుంటారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ సైతం మహేష్‌ బాబుతో సినిమా కోసం ఎదురు చూస్తున్న సందర్భాలు చాలా చూశాం.

తాజాగా మహేష్ బాబుపై తన అభిమానంను మరో హీరోయిన్‌ చాటుకుంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ ఈమధ్య కాలంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా తెలుగులో భైరవం సినిమాలో అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అదితి ఒక ఇంటర్వ్యూలో తనకు మహేష్ బాబుపై ఉన్న అభిమానంను మాటల్లో చెప్పింది. తనకు మహేష్ బాబుపై ఉన్న అభిమానంతో ఆయనతో ఫోటో దిగాలని కోరుకున్నాను, ఆయనతో ఫోటో దిగిన సమయంలో చాలా సంతోషంగా అనిపించిందని కూడా అదితి చాలా బోల్డ్‌గా, సింపుల్‌గా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాకు, నా సోదరి ఐశ్వర్యకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఒకసారి ఆయన ఒక హోటల్‌లో కనిపించిన వెంటనే ఫోటో కోసం వెళ్లి అడిగాము. ఆయన వెంటనే ఇప్పుడు కాదు అంటూ నో చెప్పాడు. దాంతో మేము నిరుత్సాహంతో అక్కడ నుంచి వెళ్లాము. అయితే మేము శంకర్‌ గారి కూతుర్లం అనే విషయం తెలిసి దగ్గరకు పిలిచి మరీ మాతో ఫోటో దిగాడు. ఆయన చాలా స్వీట్‌ పర్సన్‌, ఆయన చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయన ప్రతి ఒక్కరితోనూ కూల్‌గా మాట్లాడటం మేము చూశాం. ఆయనను దగ్గరగా చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఆ సమయంలో ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్‌ చేశామని అతిది శంకర్‌ చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో వచ్చిన మహేష్ బాబు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాడు. దాంతో మహేష్‌ బాబు అభిమానులు ప్రస్తుతం రూపొందుతున్న రాజమౌళి సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చు. 2027లో వీరి కాంబో మూవీ విడుదల ఉంటుందని తెలుస్తోంది. భారీ విజువల్‌ వండర్‌గా ఈ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో రాజమౌళి రూపొందిస్తున్నాడు. మహేష్ బాబు సినిమా రావడానికి చాలా సమయం ఉంది. కనుక ఈ లోపు మహేష్ బాబు పాత సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతున్నాయి.

Tags:    

Similar News