భార్యా భ‌ర్త‌ల సంబంధంలా అవ‌కాశాలు స‌మానంగా!

అదితి రావు హైద‌రీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు హైద‌రాబాద్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో న‌టించింది.;

Update: 2025-06-17 22:30 GMT

అదితి రావు హైద‌రీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు హైద‌రాబాద్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో న‌టించింది. అటుపై తెలుగు, త‌మిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. 'హీరామండి' లాంటి ప్ర‌ఖ్యాత వెబ్ సిరీస్ లో నూ న‌టించింది. కానీ అదితి ఏ భాష‌లోనూ నిల‌దొక్కుకోలేదు. అవ‌కాశం వ‌చ్చిన చోట‌ల్లా సినిమాలు చేసుకుంటూ వెళ్ల‌డం త‌ప్ప టార్గెట్ గా ఏ భాష‌లోనూ కొన‌సాగ‌లేదు.

రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన గాంధీ టాకీస్ తర్వాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. 'హీరామండి'  నెట్ ప్లిక్స్ సిరీస్ లో మాత్రం గతేడాది బుల్లి తెర‌పై అల‌రించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది లేదు. ఇదే క్ర‌మంలో న‌టుడు సిద్దార్ధ్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సిద్దార్ధ్ కెరీర్ కూడా ఏమంత యాక్టివ్ గా లేదు. అవ‌కాశం వ‌స్తే న‌టించ‌డం లేదంటే ఖాళీ అన్న‌ట్లే ప‌రిస్థితి క‌నిపిస్తుంది.

అప్పుడ‌ప్పుడు వివాదాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మాత్రం నెట్టింట వైర‌ల్ అవుతున్నాడు. తాజాగా చిత్ర ప‌రిశ్రమ‌లో అవ‌కాశాల‌ను ఉద్దేశించి అతిది రావు హైదరీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సినిమా అవ‌కాశాలు అనేది జీవిత భాగ‌స్వామిలా ఆడ‌-మ‌గ అనే తేడా లేకుండా అవ‌కాశాలు క‌ల్పించాలి. 'హీరామండి' త‌ర్వాత నాకు మంచి పేరొచ్చింది. అది చూసి నాకు అవ‌కాశాల‌తో మ‌రింత బిజీగా మారుతాన‌ని భావించాను.

కానీ నా కెరీర్ అలా సాగలేదు. ఆ సిరీస్ చేసిన త‌ర్వాత ఒక్క అవ‌కాశం కూడా రాలేదు. నాలా చాలా మంది న‌టీమ‌ణులు అవ‌కాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇండ‌స్ట్రీలో కొంత వివ‌క్ష క‌నిపిస్తున్న‌ట్లు ఉంది అని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం అతిది రావు హైద‌రీ ఓ సాతిరే అనే వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. క‌మిట్ అయి కొన్ని నెల‌లు గ‌డుస్తున్నా? మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

Tags:    

Similar News