చిన్నతనంలోనే లైంగిక వేధింపులు.. పవన్ కళ్యాణ్ బ్యూటీ ఎమోషనల్!

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తమ్ముడు'లో తన అందంతో మెప్పించిన అదితి గోవిత్రికర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే గుండె బరువెక్కుతుంది.;

Update: 2026-01-28 14:30 GMT

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తమ్ముడు'లో తన అందంతో మెప్పించిన అదితి గోవిత్రికర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఒక సాధారణ అమ్మాయిగా ఆమె ఎదుర్కొన్న వేధింపులు, చిన్ననాటి చేదు జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ధైర్యంగా తన గతాన్ని బయటపెట్టిన అదితి మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. తెరపై గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్ల జీవితం వెనుక మనం ఊహించని కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి అని ఈమె మాటల ద్వారా తెలుస్తోంది.

చిన్ననాటి ఆ చేదు అనుభవం:

అదితి గోవిత్రికర్ తన చిన్నతనంలో ఎదుర్కొన్న అత్యంత భయానక సంఘటన గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేవలం ఆరు లేదా ఏడు ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే, తన తండ్రి స్నేహితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. ఆ వయస్సులో అతడు తనతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తను అర్థం చేసుకోలేకపోయానని, ఆ ఘటన నుంచి మానసికంగా కోలుకోవడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని చెప్పారు. నమ్మకమే పునాది గా ఉండే బంధుత్వాలు, స్నేహాల మధ్య కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం అత్యంత విచారకరమని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ముంబై ప్రయాణాల్లో వేధింపులు, ఆమె రక్షణ: ఇక చదువు కోసం ముంబై వెళ్లిన తర్వాత కూడా అదితికి కష్టాలు తప్పలేదు. ఒక అందమైన అమ్మాయిగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం ఆమెకు ఒక సవాలుగా మారింది. లోకల్ ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మృగాల్లా ప్రవర్తించే మనుషుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి.. తన శరీరానికి ఎవరూ తగలకుండా ఉండేందుకు తన స్కూల్ బ్యాగ్ ను ఒక కవచంలా అడ్డుగా పెట్టుకుని ప్రయాణించేదాన్ని అని ఆమె గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి సమాజంలో మహిళల భద్రత ఎంత దారుణంగా ఉందో ఆమె పంచుకున్న ఈ అనుభవాలు అద్దం పడుతున్నాయి అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ధైర్యం వీడని అదితి ప్రయాణం:

ఇక ఇన్ని అడ్డంకులు, వేధింపులు ఎదురైనప్పటికీ అదితి గోవిత్రికర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. మోడలింగ్ నుండి సినిమాల వరకు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన గతాన్ని ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టడం ద్వారా, బాధలో ఉన్న ఇతర మహిళలకు ఆమె మాటల ద్వారా ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ చేదు జ్ఞాపకాలు తనను బాధపెట్టినప్పటికీ, తన ఎదుగుదలను మాత్రం ఆపలేకపోయాయని ఆమె నిరూపించారు. ఆడపిల్లల పట్ల సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాలని, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఆమె కోరుతున్నారు.

Tags:    

Similar News