ఆ హీరోకి జోడీగా... హీరోయిన్ ప్రేమ పుకార్లకు చెక్?
బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు తమిళ సినిమా చేయలేదు;
బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు తమిళ సినిమా చేయలేదు. కానీ తమిళ హీరో ధనుష్ తో ఈమె ప్రేమలో ఉందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆ మధ్య ఏకంగా పెళ్లికి సంబంధించిన తేదీ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. ధనుష్, మృణాల్ మధ్య ప్రేమ ఎక్కడ మొదలు అయింది, ఇద్దరికి ఎలా సెట్ అయింది అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. పుకార్లను కొట్టిపారేస్తూ ఇద్దరి నుంచి ప్రకటనలు వచ్చాయి. అయినా కూడా నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్లుగా కొందరు లాజిక్ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటున్నాడు. మృణాల్ కూడా సింగిల్‌గానే ఉంది. కనుక ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంలో తప్పేముంది అన్నట్లుగా కొందరు వారికి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు.
ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమ...
ధనుష్, మృణాల్ ప్రేమ వ్యవహారంకు తమిళ మీడియాలో ప్రముఖంగా కవరేజ్ లభిస్తోంది. ఈ సమయంలో వచ్చిన ఒక సినిమా ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ధనుష్ కి విరోది అని ప్రచారం జరిగే శింబు కొత్త సినిమా ప్రకటన అన్ని వర్గాల వారి దృష్టిని ఆకర్షిస్తోంది. శింబు హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి. శింబు సినిమాతో మృణాల్ తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం దాదాపు కన్ఫర్మ్ అయింది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
శింబు హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో...
ఒకవేళ ధనుష్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉండి ఉంటే కచ్చితంగా శింబుతో సినిమాకు కమిట్ అయ్యేది కాదు అనేది తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. ధనుష్ కి శింబు కి ఉన్న వైరం కచ్చితంగా మృణాల్ పై కూడా ఉంటుంది. అంటే ధనుష్ తో ప్రేమలో మృణాల్ లేదని, అందుకే శింబుతో సినిమా కమిట్ అయిందని చాలా మంది అంటున్నారు. ఒక వ్యక్తిని ప్రేమిస్తూ, మరో వైపు ఆ వ్యక్తి కి విరోధి అయిన వ్యక్తితో కలిసి నటించడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు. కనుక మృణాల్ ప్రేమ విషయం నిజం కాదని మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్, మృణాల్ కలిసి వర్క్ చేసినంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ ప్రచారం జరిగింది, అంతే తప్ప ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారని, ఇద్దరి మధ్య స్నేహం కూడా పెద్దగా ఉన్నట్లు అనిపించడం లేదు అని కొందరు అంటున్నారు.
టాలీవుడ్ లో మాదిరిగా కోలీవుడ్‌లోనూ..
మొత్తానికి మృణాల్ ఠాకూర్, ధనుష్ మధ్య ఉన్న ప్రేమ విషయం గురించి ఇన్నాళ్లు అనుమానం వ్యక్తం చేసిన వారు, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ ప్రేమ ఉంది అంటూ చెబుతూ వచ్చిన వారు ఇప్పుడు శింబుతో మృణాల్ నటించేందుకు ఒప్పుకున్న వెంటనే ప్రేమ విషయం కేవలం పుకార్లు మాత్రమే అయ్యి ఉంటుంది అని అంటున్నారు. హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ కచ్చితంగా కోలీవుడ్‌లో మంచి స్టార్‌డం దక్కించుకుంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకోవడంతో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ లో మరింత బిజీ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి టాలీవుడ్‌లో మాదిరిగా ఈ అమ్మడికి కోలీవుడ్‌లో లక్ కలిసి వచ్చి సినిమా హిట్ అయ్యేనా చూడాలి.