అనిల్ నెక్ట్స్ మూవీ.. కొత్త కథతోనే ఎందుకంటే?
అనిల్ తన నెక్ట్స్ మూవీని వెంకీతోనే చేస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ కాకుండా వేరే సబ్జెక్టు ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న.;
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన కెరీర్లో చేసిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలుస్తూనే ఉన్నాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్ తర్వాతి సినిమా కోసం ఇప్పుడందరూ ఎదురుచూస్తున్నారు.
వెంకీ- అనిల్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు
ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను విక్టరీ వెంకటేష్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ తో అనిల్ ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను వెంకీతో చేసిన అనిల్, రీసెంట్ గా మన శంకరవరప్రసాద్ గారు మూవీ కోసం కూడా కలిసి వర్క్ చేశారు. అంటే వెంకీ ఇప్పటికే అనిల్ డైరెక్షన్ లో నాలుగు సినిమాలు చేశారు.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం
ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఐదో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ వస్తుందని అనిల్, వెంకీ గతంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి వర్క్ చేస్తన్నారని అంటుండటంతో ఈ ప్రాజెక్టు సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అనిల్ మాత్రం తన నెక్ట్స్ మూవీ ఓ కొత్త ఆలోచనతో రాబోతుందని, అది సీక్వెల్ కాదని క్లారిటీ ఇచ్చారు.
అనిల్ తన నెక్ట్స్ మూవీని వెంకీతోనే చేస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ కాకుండా వేరే సబ్జెక్టు ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే దానికి ఉండే క్రేజ్ వేరు. పైగా వెంకీ- అనిల్‌ది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో సీక్వెల్ మూవీ అంటే సినిమాకు ఉండే హైపే వేరు. ఇవన్నీ తెలిసి కూడా అనిల్ సీక్వెల్ మూవీ కాకుండా కొత్త కథతో రావడానికి కారణముందని తెలుస్తోంది. బడ్జెట్, నిర్మాతలు, రెమ్యూనరేషన్లు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనిల్ గత కొన్నాళ్లుగా తన గత సినిమాల నిర్మాతలందరితోనూ తన నెక్ట్స్ మూవీ గురించి డిస్కస్ చేసి, ఆఖరికి సాహు గారపాటితో తన తర్వాతి సినిమాను చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా, అనిల్ తన నెక్ట్స్ మూవీని ఏ హీరోతో చేసినా, ఏ నిర్మాణ సంస్థలో చేసినా వచ్చే ఏడాది సంక్రాంతికి తన నుంచి ఓ సినిమా రావడమైతే పక్కా.