నాగవంశీ ట్రైలర్ రిలీజ్ చేయాలనుకోవడం లేదా?
అయితే నాగవంశీ ఆ విషయాన్ని ఉదాహరణగా చెప్పడంతో.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం ట్రైలర్ పై చర్చ మొదలైంది.
సినిమా రిలీజ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు మరో విషయంపై చర్చ మొదలైంది. ఆదర్శ కుటుంబం- హౌస్ నెం. 47 మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది.. అసలు ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన లేటెస్ట్ కామెంట్సే కారణంగా కనిపిస్తున్నాయి.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. రీసెంట్ గా వాయిదా పడింది. సినిమా పనులు పూర్తి చేసి, కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా అవుట్ పుట్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. ప్యారడైజ్ ట్రైలర్ రిలీజ్ విషయాన్ని నాగవంశీ ప్రస్తావించారు.
ఆ సినిమాకు ట్రైలర్ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఆయన వివరించారు. ట్రైలర్ కోసం హడావుడి చేయడం కంటే.. సినిమా పనులు పూర్తి చేయడానికే నాని అండ్ టీమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పారు. అనుకున్న తేదీకి సినిమా రాకపోయినా.. మంచి మూవీ ఇవ్వడం ఇంపార్టెంట్ అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు థియేటర్ లో పూర్తి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైలర్ కట్ చేయలేదని ఆయన పరోక్షంగా మాట్లాడారు.
అయితే నాగవంశీ ఆ విషయాన్ని ఉదాహరణగా చెప్పడంతో.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం ట్రైలర్ పై చర్చ మొదలైంది. ఆ సినిమాకు కూడా ట్రైలర్ విషయంలో అలాంటి ఆలోచనే ఉందా అనే హైప్ పెరిగింది. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. ప్యారడైజ్ కు నాగవంశీ నిర్మాత కాదు. ఆ సినిమా ట్రైలర్ గురించి తన అభిప్రాయాన్ని మాత్రమే ఆయన ప్రెస్ మీట్ లో ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పారు.
దాన్ని ఆదర్శ కుటుంబంకు సంబంధించిన నిర్ణయంగా ఇప్పుడే చెప్పలేం. ఇక ఆ సినిమాపై ఇప్పటికే బజ్ ఉంది. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో నేచురల్ గానే హైప్ నెలకొంది. ఆ బజ్ ను ట్రైలర్‌తో మరింత పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ప్రమోషన్స్ వేగం పెరగాల్సి ఉంటుంది. అదే సమయంలో ట్రైలర్‌లో కథను ఎక్కువగా రివీల్ చేయకుండా.. సినిమాను థియేటర్లలో చూడాలనే ఆసక్తిని అలాగే ఉంచాలనే ఆలోచన కూడా ఉండొచ్చు.
ఏది చేసినా కొత్త రిలీజ్ డేట్ ఆధారంగానే ప్రమోషన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆదర్శ కుటుంబం ట్రైలర్ రిలీజ్ చేయరని నాగవంశీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్త రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత ట్రైలర్ విషయంలో కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ట్రైలర్ తో సినిమాపై బజ్ ను పెంచుతారా.. లేక ఎక్కువ విషయాలను బయటపెట్టకుండా థియేటర్లకు తీసుకొస్తారా అనేది వేచి చూడాలి.