• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అయ్యో.. స్కందలో శ్రీలీలకు...

అయ్యో.. స్కందలో శ్రీలీలకు న్యాయం చేయలేదే

| మాస్ సినిమాల‌కి కేరాఫ్ అడ్రెస్​ బోయ‌పాటి శ్రీను. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద

By - Tupaki Desk
Update: 2023-09-29 11:30 GMT

మాస్ సినిమాల‌కి కేరాఫ్ అడ్రెస్​ బోయ‌పాటి శ్రీను. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద. పైగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్​ అనగానే.. కాంబోపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ క‌ల‌యిక‌పై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. ముఖ్యంగా బోయ‌పాటి మార్క్ సినిమాలో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - శ్రీలీల ఎలా క‌నిపిస్తారో చూడాల‌నే ఉత్సుక‌త ఏర్ప‌డింది. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా చూస్తే.. శ్రీలీలను తన టాలెంట్​కు తగ్గట్టు వినియోగించుకోలేదని అర్థమవుతోంది.

శ్రీలీల అంటేనే గ్యామర్​తో పాటు ఫుల్​ ఎనర్జీ. మరీ ముఖ్యంగా మాస్​ డ్యాన్స్​ క్వీన్ అనే పేరు కూడా ఈ మధ్య తెచ్చుకుంది​. ఇంకా ఎంతటి క్రేజ్ సంపాదించుకుందంటే.. ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రేంజ్​లో తన పాపులారిటీ పెరిగిపోయింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్​తో పాటు మాస్​ సాంగ్స్​లో తన డ్యాన్స్​ మేనియాతో ప్రేక్షకుల్ని మాయ చేసేసింది.

దీంతో స్కందలోనూ ఇది రిపీట్​ అవుతుందని అంతా ఆశించారు. ఆమెకు సాలిడ్ రోల్ దక్కుతుందని ఆశించారు. సాధారణంగా రామ్ ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తారో అందరికీ తెలుసు. ఆయన డ్యాన్స్​కు శ్రీలీల ఎనర్జీ డ్యాన్స్​ కూడా తోడైతే స్టేజ్​ దద్దరిల్లుతుందని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో అలా లేదు. శ్రీలీల పాత్ర, స్క్రీన్ ప్రెజెన్స్​ లిమిటెడ్​గానే ఉంది.

ఆమె పాత్రకు పెద్ద స్కోప్​ లేదు. పైగా చిత్రంలోని మాస్​ సాంగ్స్ కూడా ఆమెకు పెద్ద ఫేవర్​గా లేవు. ఎక్కువగా స్పాట్​లైట్ రామ్​పైనే​ ఉంది. ఆయన్నే హైలైట్ చేశారు. దీంతో స్కంద చూసిన వారు.. శ్రీలీలను ఆమె టాలెంట్​కు తగ్గట్టు ఉపయోగించుకోలేదని అంటున్నారు. కేవలం ఉన్నంత‌లోనే తన పాత్రకు శ్రీలీల త‌న అందంతో, డ్యాన్స్‌లతో ఆకట్టుకుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రామ్ న‌ట‌న‌, డ్యాన్స్‌. బోయ‌పాటి మార్క్ మాస్ అంశాలు, యాక్ష‌న్‌, భావోద్వేగాలు సినిమాకు బలంగా నిలిచాయి. అక్క‌డ‌క్క‌డా రొటీన్‌గా అనిపించే స‌న్నివేశాలు సినిమాకు మైనస్​. ఒక్క మాటలో చెప్పాలంటే.. స‌్కంద‌ మాస్ జాత‌ర అని చెప్పొచ్చు.

Tags:    
  • Skandamovie 
  • Boapatisrinu 
  • Sreeleela 
  • Rampothineni 
  • Filmindustry 
  • Skanda 
  • Actresssreeleela 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS